* మునగాకులూ మహా ఔషధాలే
ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో ‘మునగాకు’ ఒకటి. మనలో చాలా మందికి మునగాకులో ఎన్నో
ఔషధ విలువలు ఉన్నాయనే విషయం తెలీదు. మునగాకు శరీరానికి మేలు చేసే మొనగాడుగా
చెప్పవచ్చు. తోటల్లో మునగచెట్లు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పెరట్లో కూడా ఈ
మొక్కను పెంచుతారు. కానీ ఆకును కూరగా వండుకుంటారని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. దీనిలో అధికంగా
శరీరానికి లవణాలు, విటమిన్లు, శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. శరీరానికి బలానిస్తుంది. మునగాకులో విటమిన్-ఎ, విటమిన్-సి, కాల్షియం, ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మాంసకృతులు కూడా ఉన్నాయి. మునగాకులో ఔషధ గుణాలు
విస్తారంగా ఉన్నాయి.
No comments:
Post a Comment