* బెల్లం
నైవేద్యానికి నవగాయ పిండివంటలు లేకపోయినా, వాటిని వండటానికి ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లో చిన్న బెల్లం ముక్క ఉంటే చాలు. ఆ పూటకు పనైపోతుంది. దేవతలను సైతం సంతృప్తిపరిచే బెల్లం మానవుడికి అత్యంత ప్రీతికరమైనది. హిందువుల పండగల్లోనూ, పలహారాల్లోనూ ప్రశస్థమైనదిగా పేరు కొట్టేసింది బెల్లం. తీపి వంటకాల్లో మేలైనదిగా, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అగ్రభాగాన ఉన్న బెల్లం కథ బహుతీపిగానూ ఉంటుంది. ఎందుకంటే బెల్లం మనది, మన దేశానిది, మన ఇంటిది. రకరకాల రూపాల్లో తయారయ్యే బెల్లాన్ని ఫారనర్స్ పార్శిళ్లు కట్టి మరీ మన దగ్గర నుంచి తీసుకెళుతుంటారు.
బెల్లం తయారికి ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి పెట్టింది పేరు. అయితే ఉత్పత్తిలో అధికంగా ఉండి దేశంలోనే మహారాష్ట్ర అగ్రగామిగా నిలిచింది. ఇంకా మన దేశంలో వెస్ట్ బెంగాల్, దక్షిణభారత దేశాలలోనూ బెల్లం ఉత్పత్తి బాగానే ఉంది. మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లోనూ బెల్లాన్ని అధికంగానే ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం. ఈ వివరాలను బట్టి చూస్తే ఆసియా దేశాలలో బెల్లం పేరు విరివిగా వినిపిస్తోంది. తక్కిన దేశాలలో పంచదారే తప్ప బెల్లం తీపి పెద్దగా తెలియదనే చెప్పాలి.
మన పండుగల్లో ఎన్నో వంటకాలకు చక్కని తీపిని తీసుకువచ్చే బెల్లాన్ని పండగ పూట కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలు ఇచ్చిపుచ్చుకుంటాయి. దీని ద్వారా తమ మధ్య బంధాలు పదిలం కావాలని ఆశిస్తాయి. దీనిని బట్టి చూస్తే మన దగ్గర బెల్లం ప్రత్యేకత ఎంతటిదో ఊహించవచ్చు. ఆంగ్లంలో జగ్గరీగా పిలిచే బెల్లంను చెరుకు రసం నుండి తయారు చేస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్ల నుంచి కూడా బెల్లాన్ని తయారు చేస్తారని కథనాలు ఉన్నాయి. మనకు తెలిసినంతవరకు బెల్లం అంటే చెరకు నుంచి తీసి, తయారుచేసినది. చెరుకును కట్ చేసి, పైనున్న ఆకులను తీసేసి గానుగ వద్దకు చేర్చుతారు. ఇలా తెచ్చిన చెరుకు నుంచి రసం తీసి, వెడల్పాటి పేద్ద ఇనుప బాండీలో పోసి, గట్టిపడేవరకు బాగా కాగబెడతారు. అటు తర్వాత అచ్చులలో పోసి, బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, నల్లగానూ, మెత్తగానూ, గట్టిగా తయారవుతుందన్నమాట.
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతకు దివ్యౌషధంగా బెల్లం పేరే చెబుతారు. అయుర్వేద వైద్యశాస్త్రంలో బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడుతారు. ఆరోగ్యాన్ని తద్వారా ఆయుష్షును, అనుబంధాలను పెంచే బెల్లంతో ఈ పూటకు ఏ వంటకం తయారుచేయాలో చిన్న బెల్లం ముక్క బుగ్గన పెట్టుకొని, ఆ తీపిలోని పసందును అనుభవిస్తూ ఆలోచించండి.

No comments:
Post a Comment