Sunday, March 10, 2013

తలనొప్పికి టానిక్‌ ... మంచినీరు


తలనొప్పికి టానిక్‌ ... మంచినీరు

మనలో చాలామంది తగినంత నీరు తాగరు. ముఖ్యంగా స్ర్తీలు పనుల్లో పడిపోయి దీని గురించి అంతగా పట్టించుకోరు. ఒకోసారి దాహం వేస్తున్నా ఏమతుందిలే అని తేలికగా తీసేకుసుకంటారు. కానీ ఒంట్లో ఏమాత్రం నీటి శాతం తగ్గినా (డీహైడ్రేషన్‌) మూడ్‌ మారిపోవటానికి కారణమవుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

ఏకాగ్రత దెబ్బతినటం, అలసట, తలనొప్పి వంటివి వస్తాయని తాజా అధ్యయనంలో తెలిసింది. ఇందులో ఆరోగ్యవంతులైన యువతలను ఎంచుకొని పరిశీలించారు. నీటిశాతం మామూలుగా ఉన్నప్పుడు, తగ్గిన తర్వాత వీరిలో ఏకాగ్రత, మూడ్‌, జ్ఞాపకశక్తులను పరీక్షించారు. ఇలా 28 రోజుల తేడాతో మూడుసార్లు ప్రయోగాలు చేశారు.

ఒంట్లో నీరు తగ్గినపుడు వీరిలో మానసిక సామర్థ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు గానీ ఏకాగ్రత మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. లక్ష్యాలను గుర్తించే పరీక్షలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడ్‌ మారిపోయి ఉత్సాహం తగ్గిపోవటం, అలసట పెరిగిపోవటం వంటి లక్షణాలు కనిపించాయి. ఇవి చివరికి తలనొప్పికి దారితీస్తుండటం గమనార్హం. తేలికపాటి వ్యాయామాలు చేసినా, కంప్యూటర్‌ ముందు పనిచేస్తున్నా సరే.. మహిళలు ఎక్కువగా అలసటకు గురవుతుంటారని కనెటికట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఒకరు చెబుతున్నారు. అందువల్ల ఆహారం తినేటప్పుడే కాదు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు.

నిజానికి మనకు దాహం వేసే సమయానికే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి ఉంటుందని గుర్తించాలి. తలనొప్పి, అలసట ఉన్నాయంటే మరింత ఎక్కవ నీళ్లు తాగాలి. కాబట్టి నిరంతరం పనుల్లో మునిగిపోయే స్ర్తీలు, వ్యాయామాలు చేసే మహిళలు తరచుగా నీళ్లు తాగటం మేలు. దీంతో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు.

No comments:

Post a Comment