Saturday, March 9, 2013

* గుండెకు ఉప్పు ముప్పు




* గుండెకు ఉప్పు ముప్పు
బిపి (రక్తపీడనం) తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఉప్పు తక్కువ చేయక తప్పదు అంటారు. కాని ఉప్పు తక్కువ చేయడం వల్ల గుండెకు చేటని అమెరికన్ జర్నల్ హైపర్‌టెన్షన్ మీద చేసిన స్టడీలో వెల్లడయ్యింది. సాధారణ రక్త పీడనం ఉన్న వాళ్లు ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గిస్తే రక్తపీడనం కూడా ఒక శాతం తగ్గుతుంది. ఇక ఉప్పును తగ్గించడం వల్ల గుండెకు వాటిల్లే ముప్పు విషయానికి వస్తే... కొలెస్ట్రాల్ మోతాదు 2.5 శాతానికి పెరుగుతుంది. ట్రైగ్లిసరైడ్స్ ఏడు శాతం పెరుగుతాయి.

ప్లాస్మారెనిన్, ప్లాస్మా ఆల్డోస్టిరాన్, ప్లాస్మా అడ్నిలిన్ ప్లాస్మా నోరాడ్రినలిన్, వంటి గుండెకు హాని కలిగించే కారకాన్నీ పెరుగుతాయి. అందుకని ప్రకటనుల చూసో, పత్రికల్లో చదివో ఉప్పును తగ్గించకుండా డాక్టరు సలహా మేరకు ఉప్పు మోతాదును ఆహారంలో తీసుకోవడం ఉత్తమం.

No comments:

Post a Comment