Friday, March 15, 2013

మెడిటేషన్ అంటే ఏమిటి...? ఎలా, ఎప్పుడు చేయాలి?


మెడిటేషన్ అంటే ఏమిటి...? ఎలా, ఎప్పుడు చేయాలి?

ప్రాణం ఉన్న ఏ జీవానికైనా ఆరోగ్యం ముఖ్యం. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినప్పుడు ఏ ఆరోగ్యసమస్యలు లేకుండా జీవించగలడు. బ్రతికి ఉన్నన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానం. ఆనందం, తృప్తి వంటి భావనలు ఒక్కో మనిషిలో ఒక్కోవిధంగా ఉంటాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో మెడిటేషన్‌ గా పిలవబడే దానిని మన పూర్వీకులు ధ్యానంగా చెప్తారు. దీని ద్వారానే మనలోని ఆత్మకుజ్ఞానం లభిస్తుందని, మనకుగల పరిమితులు, సామర్ధ్యాలు తెలుసుకో గలుగుతామంటారు పెద్దలు. నిజమే...ఏకాగ్రతతో మెడిటేషన్(ధ్యానం) చేస్తే అనేక లాభాలున్నాయి... మనలో దాగివున్న నిగూఢ శక్తులను అది వెలికి తీసి, మనలోని సామర్థ్యానికి మరింత మెరుగు పెడుతుంది ఈ మెడిటేషన్(ధ్యానం)... అయితే ఇలా పొందిన పరిజ్ఞానం ముందుగా మనగురించి మనం పూర్తిగా తెల్సుకున్నపుడే మనలోని మంచి గుణాలని బహిర్గతం చేసుకోవచ్చు.

ప్రశాంతమైన జీవితానికి మెడిటేషన్ బాగా సహాయపడుతుంది. అసలు మెడిటేషన్ అంటే ఏమిటి? మనమంటే ఏమిటో తెలుసు కోవడం. మన మైండ్‌ ప్రశాంతంగాను, విశాలంగాను, రిలాక్స్ గాను, ఒత్తిడిలేకుండా వుండాలంటే కనీసం రోజుకు 15నుండి 20 నిమిషాలపాటు ధ్యానం చేయాలి. ధ్యానానికి రోజులో ఉదయం, సాయంత్రం వేళలు అనుకూలమైనవి. కనుక నేటినుండే మీరు మీ ధ్యానాన్ని మొదలుపెట్టండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి నివ్వండి. మంచి మనసు కలిగి వుండటం సంతోషానికి ప్రధానం అన్నది మరవకండి.

ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్‌ చేయడం అలవర్చుకోండి. మెడిటేషన్‌ చేయడమంటే హిమాలయ పర్వతాలెక్కి తపస్సు చేయడమంత కష్టమైన పనేమీ కాదు. రోజుకు రెండుసార్లు అంతగా వీలుగాకపోతే ఒకసారైనా చేయవచ్చు. కొద్ది సమయంలోనే మీరు ఒకచోట నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కూర్చోండి. మెడిటేషన్‌ కొనసాగించడానికి ఎన్నో పద్ధతులు వున్నాయి. అందుకు మీ ఎదురుగా ఒక కొవ్వొత్తిని వెలిగించి పెట్టుకుని దాని వంకే చూస్తూ మెడిటేషన్‌ చేయవచ్చు. మీకు నచ్చిన ఒక పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తూ చేయవచ్చు. మీరు ఎంచుకునే పద్ధతి ఏదైనప్పటికీ మెడిటేషన్‌లో మీరు చేయాల్సింది క్రమం తప్పకుండా ప్రతిరోజూ ప్రశాంతంగా కూర్చుని మీతో మీరు గడపడం. మెడిటేషన్‌ అంటే ఇదే. ఆత్మావలోకనం ఏర్పరుచుకోవడం, కాస్సేపు ఇలా గడపటానికి మీరు ఏ ప్రదేశాన్నయినా ఎంచుకోవచ్చు. అది మీ ప్రశాంతతకు భగం కలిగించకుండా వుంటే చాలు.

ప్రపంచం ఎలా నడుస్తోందో మనం తెలుసుకోవాలంటే ధ్యానంచేయాల్సిందే అంటాడు గౌతమ బుద్ధుడు. ఇది నిజం కూడా.. ధాన్యం తెలివినిస్తుంది. ధ్యానం చేయకపోతే, అంతాతెలియనిస్ధితి ఏర్పడి మనిషి అభివృద్ధి అసాధ్యమన్నది కొందరి భావన. మన సమాజంలో ప్రస్తుతం మన ఒత్తిడి తగ్గించడానికి అనేక ధ్యానపద్ధతులు నేర్పిస్తున్నారు మెడిటేషన్ ఎక్స్ పర్ట్స్. ఇవి ఎలా చేయాలి... వాటి ఉపయోగాలేంటంటే...

మెడిటేషన్ (ధ్యానం) చేసేటప్పుడు మీవీపును నిటారుగా సౌకర్య వంతంగా పెట్టి కూర్చొని, కళ్ళు మూస్కొని, తేలికగా శ్వాసను పీల్చండి. ఈ ధ్యాన పద్ధతిలో శ్వాస మీ ప్రవేశించటం, బయటకు వదలటం ప్రక్రియను శ్రద్దగా గమనించాలి. దీనినే శ్వాస మీద ధ్యాస అని పిలుస్తాం. రోజూ ధ్యానాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు చేస్తే మనిషిలో ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతుంది.

ఇక మానసిక ధాన్యంతో మనసును ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకోవచ్చు. నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని, ప్రశాంతతని ఆశ్వాదిస్తూ...ఈ ధ్యానం రోజూ 10 నిమిషాల చొప్పున రెండుసార్లు చేస్తే చాలు. మనసు, శరీరం రెండు అనుసంధానించబడి ఊహించ లేని శక్తి కల్గి మనలో తీవ్ర నమ్మకాన్ని పెంచుతుంది. . ధ్యానించేటపుడు ఎంత ప్రధానమైన పని అయినా సరే వదిలేసి పాజిటివ్‌ ఆలోచనలోకి వెళ్లాలి.


ఊహా ధ్యానం మరో పద్దతి. రోజులో 20-30 నిమిషాల సమయం పూర్తి విశ్రాంతిలో ఉంటూ, ఆహ్లాదా న్నిచ్చే చిత్రాలు, బొమ్మలు, పెయింటింగ్‌లు చూస్తూ వుండండి.అవి మీ మనస్సుల్లో నేల కొన్ని ఆందోళనల్ని తగ్గించి...పూర్తిస్థాయి విశ్రాంతిని కలిగిస్తాయి. కనుక ఈ ధ్యానం చేయాలనుకుంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా ఏ ప్రదేశంలో అయినా చేయవచ్చు.

No comments:

Post a Comment