Saturday, March 9, 2013

గుడ్డులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

* గుడ్డులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కొంతమంది తమను తమూ ఎగ్ టేరియన్స్ గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందు వల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాసాంహరం అంటారు. కానీ చాలా మంది శాకాహారంగా నే భావిస్తున్నారు కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల గుండెజబ్బు వస్తుందని వేడిచేస్తుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ అభిప్రాయంలో వాస్తవం లేదు. వారంలో వారం రోజులు గుడ్డు తిన్నా కూడా దాని కారణంగా ఎటువంటి గుండెజబ్బులూ రావడానికి ఆస్కారం లేదని వైద్య నిపునులు అంటున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు తలెత్తుతాయి కానీ, కాలేయం కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేయాలంటే ఆహారంలో హానికారక శాచురేటెడ్, ట్రాన్స్ ప్యాట్లు ఉన్నప్పుడే అది సాద్యం అవుతుంది. నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్ శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. బరువును కూడా తగ్గిస్తుంది. అలాఅని ఒక రోజుకు నాలుగు గుడ్లును తినడం మంచిది కాదు. గుడ్లను సరైన పద్దతిలో ఉడికించి ఒక రోజుకు ఒకటి రెండు గుడ్లును తినవచ్చు. కాబట్టి గుడ్డువల్ల కొన్ని నిజాలతో పాటు..మరికొన్ని హెల్గ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

కోడి గుడ్డుతో ఉపయోగాలు... గుడ్డు పౌష్టికాహారం: శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. ముఖ్యంగా 9 డిఫరెంట్ టైప్స్ అమినో ఆసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
బరువు తగ్గడానికి: బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు... అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు. కంటి ఆరోగ్యానికి: కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి ఐ సైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసోనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి. పిల్లల పెరుగుదలకు: పిల్లల పెరు గుదలకు మంచిది. పిల్ల మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుసంది.

No comments:

Post a Comment