Saturday, March 9, 2013

* జీర్ణకోశ సమస్యలకు టమాట


* జీర్ణకోశ సమస్యలకు టమాట

ప్రకృతి సహజంగా లభించే తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలను తీసుకోవటంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు తగిన మోతాదులో అందుతాయి. కూరగాయలలో ఒకటైన టమాటాలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకున్నట్ల యితే.. జీర్ణాశయంలో అధికంగా తయారయ్యే ఆసిడ్లను నివారిస్తాయి. తద్వారా జీర్ణకోశ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

విటమిన్‌ సీ పరిమాణం అధికంగా ఉన్న టమాటా లను ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల అజీర్తి సమస్యలను అరికట్టవచ్చు. అలాగే వీటిలో ఎక్కువగా లభించే ఏ, సీ విటమిన్లు కంటిచూపును మెరుగుపర చటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే టమాటాలు దంతాలను దృఢపరచటంలో కూడా ఉపయోగపడతాయి.

టమాటాల్లో క్యాల్షియం, పాస్ఫరస్‌ లాంటి ఏడు రకాల లవణాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రపర చటంలో, రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించటం లో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలు సైతం టమాటాల్లో అధికంగా లభిస్తాయి. ఈ పిండి పదార్థలలోని విటమిన్లు కాలేయాన్ని శుభ్రపరచటంలోనూ, కాలేయంలోని క్రిములను నిర్మూలించటంలోనూ శక్తివంతంగా పనిచేస్తాయి.

మాంసకృత్తులు, ఐరన్‌, పొటాషియం, సోడియం, సల్ఫర్‌, మెగ్నీషియం, క్లోరిన్‌, కాపర్‌లతోపాటు ఫోలిక్‌ ఆసిడ్‌, నియాసిన్‌, ఆక్సాలిక్‌ ఆసిడ్‌ లాంటి విటమిన్లు కూడా కలిగిన టమాటాలు తిన్న రెండు గంటలలోపే జీర్ణమవుతాయి. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలోనూ, పురుషుల్లో ప్రొస్టేట్‌ గ్రంథికి క్యాన్సర్‌ సోకకుండా ఆపటంలోనూ టమాటాలు చక్కగా పనిచేస్తాయి.

No comments:

Post a Comment