Saturday, March 9, 2013

* ఉసిరి కాయ ...ఆరోగ్యపు సిరిసంపద...!

* ఉసిరి కాయ ...ఆరోగ్యపు సిరిసంపద...!

ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో...ఎందుకంటే ఉసిరికాయతో రకరకాల వంటలు, ఊరగాయలు తయారుచేస్తారు. అంతే కాదండోయో ఇందులో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఉసిరికాయను ఇంగ్లీష్ లో gooseberry అంటారు. దీని పేరులాగే ఇవి తినడానికి కూడా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి, మరియు విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. అందుకే మన పూర్వికులు ఎపటినుంచో వీటి గురించి చెపుతూనే వున్నారు. అందుకే దీన్ని ప్రకతి ప్రసాధించిన వరం అంటుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువుగా ఉండే పదార్దం ఈ ఉసిరికాయ. ఈ ఒక్క ఉసిరి కాయ రెండు నారింజ పండ్లతో సమానం. ఉసిరికాయ జ్యూస్ వల్ల ఆరోగ్యానికి చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒకే మోతాదులో తీసుకోవడం వల్ల నిజమైన ప్రయోజనాలేంటో మనకు తెలుస్తాయి. ఆ ప్రయోజనాలు తెలుసుకోండి.. ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి....

No comments:

Post a Comment