* పండ్లతో గుండె పదిలం
సాధారణంగా 40 వయస్సు దాటిన వారికి ఎక్కువగా గుండెకు సంబంధించిన జబ్బులు రావడం సహజం. కావున 40 నుంచి 50 వయస్సు వరకూ సంవత్సరానికి ఒక సారి ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకోవాలి. 50 దాటిన వారు సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షను చేసుకొని వైద్యులు సలహా తీసుకుంటే మీ గుండె క్షేమంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, కొన్ని ఆహార నియ మాలు పాటించడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
* గుండె ఆరోగ్యానికి యాపిల్ చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఒక కప్పు యాపిల్ ముక్కల్లో 3.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
* నారింజపండ్ల రసంలో బి9 విటమిన్ ఉంటుంది. ఇది గుండెజబ్బులకు దారితీసే హోమోసిస్టైన్ను తగ్గిస్తుంది.
Fruits
* పచ్చిబఠానీల్లో బి2, బి6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లు రక్తనాళాలను పదిలంగా కాపాడుతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండెజబ్బులు వచ్చిపడతాయి.
* ద్రాక్షపండ్లు గుండెజబ్బులను దూరంగా ఉంచుతాయి. ద్రాక్ష వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఫ్లావాన్స్, ఆంతోసైనిన్ వంటి ఎన్నో మంచి లక్షణాలు ద్రాక్షపండ్లలో ఉన్నాయి. ద్రాక్షను గోరువెచ్చని నీళ్లలో లేదా ఉప్పు నీటిలో కడిగి తీసుకోవడం వల్ల రసాయనాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది.
* వేరుశనగపప్పులు గుండెకు ఎంతో మేలు చేస్తాయట. రోజూ కాసిని వేరుశనగ పప్పులు, బాదంపప్పు, వాల్‌నట్స్ తీసుకుంటే గుండె నిక్షేపంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
* వీటితో పాటు బీన్స్ కూర తరచుగా తినడం వల్ల కూడా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

No comments:
Post a Comment