Saturday, March 9, 2013

* నారింజ .... యవ్వనాన్నిచ్చే నారింజ


* నారింజ .... యవ్వనాన్నిచ్చే నారింజ

నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం. దీనిని ఉష్ణ దేశాల్లోనూ, సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. మన తెలుగు దేశంలో నంద్యాల, కోడూరు, వడ్లమూడి మొదలగు ప్రాంతాలలో బాగా పండిస్తున్నారు. నారింజపండ్లు కాలం గడుస్తున్న కొద్దీ ప్రకృతిరీత్యా మార్పులు చెందుతూ వస్తున్నాయి. నిమ్మ, బత్తాయి, నారింజ ఒకే జాతికి చెందిన ఫలాలు. వీని గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. దీన్ని నిమ్మకన్నా కాస్త ఉత్తమం అంటారు. నిమ్మలోని గుణాలతో పాటుగా, తీపి అనే అదనపు గుణం కూడా నారింజ కుంటుంది.

నారింజ పండులో ఈ క్రింది పోషక విలువలున్నాయి.

తేమ - 87.8%
సున్నము - 0.5% మై.గ్రా
మాంసకృత్తులు - 0.9%
పిండి పదార్ధలు - 10.6%
భాస్వరము - 0.2% మై.గ్రా
క్రొవ్వు - 0.3%
ఇనుము - 01% మై.గ్రా
సేంద్రియ లవణాలు - 0.4%
విటమిన్‌ - ఏ - 350 I.U.
విటమిన్‌ - బి1 - 120 I.U.
విటమిన్‌ - సి - 68 I.U.
పనస పండు ఇచ్చే శక్తి - 49 కేలరీలు

నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉండటం వల్ల, దీనికి ప్రపంచంలో ఎంతో గిరాకీ ఉంది. విటమిన్ ‌- ఏ, బి స్వల్పంగా, విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. ఆరు ఔన్సుల నారింజ రసం త్రాగితే చాలు, మనిషికి ఆ రోజుకు కావలసిన 'సి' విటమిన్‌ లభిస్తుంది. కోయకుండా అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి త్రాగటం మంచిది. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని కాల్షియం దేహ ధాతువుల్లో సులభంగా కలసిపోతుంది. నారింజ తొనల చర్మంలో కాల్షియం ఎక్కువ. తీపి నారింజలో చక్కెర ఎక్కువ. కాబట్టి అది కాస్త ఎక్కువ శక్తిని ఇస్తుంది. సూర్యరశ్మిలో పండినప్పుడు, నారింజలోని పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి కాబట్టి, నారింజ సులభంగా జీర్ణ అవుతుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాలలో, జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే, దేహానికి కావలసిన రీతిగా అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. ఆహారనాళ్ళలో విషక్రిములు చేరకుండా, నారింజ వాటిని చంపివేస్తూ ఉంటుంది.

మలబద్ధకం, చాలా రోగాలకు దారి తీస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలవిసర్జన సులభంగా జరిగిపోతుంది. మలబద్దకం పోతుంది. కేవలం తీపి నారింజ ద్వారా ఉబ్బసాన్ని, శ్వాసనాళ వ్యాధులను వైద్యులు తగ్గిస్తూ ఉంటారు. జీర్ణం కాని కఠిన తిను పదార్ధలను, వేళాపాళా లేకుండా అతిగా తినటం వల్ల, ఈ రోగాలు సంక్రమిస్తుంటాయి. వారికి తేలికగా జీర్ణమయ్యే రోగ నిరోధక శక్తిగల నారింజ పండ్లను ఇస్తే, ఆ రోగాలు ఉపశమిస్తాయి. 'పయోరియా' వంటి దంతవ్యాధులు నారింజ రసాన్ని సేవిస్తే తగ్గిపోతాయి. నారింజలో రెండు రకాలున్నాయి - పుల్ల నారింజ, తీపి నారింజ. పుల్ల నారింజ కాయలలో నీరు అధికంగా ఉంటుంది, లవణాలు తక్కువగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో కాస్తుంటాయి. తీపి నారింజలు వేసవిలో కాస్తాయి. వీటిలో నీటి భాగం తక్కువ. లవణాలు ఎక్కువ. ఇది దేహానికి మేలు మేస్తాయి. కాబట్టి వేసవి కాలంలో కాచే నారింజ పండ్లను తినటం ఎక్కువ శ్రేయస్కరం.

నారింజ పండు కఫ, వాత, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులోఊరించి, ఎండించి, కారం మరియు మెంతి చేరిస్తే, ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. దీనిని సంస్కృతంలో "నారంగ-ఐరావతి:" అంటారు. హిందీలో "నారంగీ, సంతరా" అంటారు. బంగ్లాలో "కమలా రేఖ" అంటారు. ఇంగ్లీషులో "ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌" అన్న సాంకేతిక నామం దీనికుంది.

No comments:

Post a Comment