Thursday, February 27, 2014

Green Tea అద్భుతాలు

మనం నిత్యం తాగే "టీ" ముఖ్యంగా నాలుగు రకాలు. వైట్, గ్రీన్, బ్లాక్, వూలాంగ్ (బ్లాక్ డ్రాగాన్ టీ). ఈ టీ ఆకులన్నీ Camellia sinensis అనే టీప్లాంట్ నుంచే వస్తాయి. కాకపోతే ఆకులను "స్టీమ్ చేయటం", "ఫెర్మెంట్ చేయటం"(oxidation), "ఎండబెట్టడం" మొదలైన ప్రోసెసింగ్ విధానంలో తేడా వల్ల వాటికి ఆ యా పేర్లు, ప్రత్యేకమైన రుచులు వచ్చాయి. మిగిలిన టీలన్నింటిలోకీ "బ్లాక్ టీ" కొద్దిగా స్ట్రాంగ్ గానూ, ఎక్కువ కెఫీన్ ను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం నేను చెప్పబోయేది ఆరోగ్యకరమైన "గ్రీన్ టీ" గురించి. చైనా లో పుట్టిన ఈ గ్రీన్ టీ ఈ మధ్యనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది. అతి తక్కువగా ఫెర్మెన్ట్ చేయబడ్డ టీ ఆకులు ఇవి. గ్రీన్ గ్రీన్ టీ కూడా చాలా వరైటీలు ఇప్పుడు లభ్యమౌతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వైద్య పరమైన రీసర్చ్ లు, ప్రయోగాల వల్ల గ్రీన్ టీకు సంబంధించిన ఎన్నో ప్రయోజనాలూ, ఉపయోగాలూ కనుగొనబడ్డాయి. గ్రీన్ టీ తాగటo వల్ల చేకూరే ఆరోగ్యపరమైన కొన్ని ఉపయోగాలు:
* గ్రీన్ టీలో EGCG (Epigallocatechin Gallate) అనే శక్తివంతమైన anti-oxident ఉంది. (anti-oxidents శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కాపాడతాయి)
* రెగులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి "హార్ట్ డిసీజెస్" వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.
* కొన్నిరకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీ లో ఉంది.
* అధిక బరువును తగ్గిస్తుంది.
* రోజూ గ్రీన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
* బేక్టీరియాను నివారించే సామర్ధ్యం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ ను రానివ్వకుండా చేయటమే కాక పళ్ళ ను కూడా సురక్షితంగా ఉంచగలుగే శక్తి గ్రీన్ టీకు ఉంది.
* గ్రీన్ టీ చర్మ రక్షణకు, సౌందర్యపోషణకు కూడా ఉపయోగకరం అని శాస్త్రవేత్తలు కనుగొనటమ్ వల్ల మార్కెట్లో గ్రీన్ టీ తో తయారు చేసిన సబ్బులు, షాంపూలూ, డియోడరెంట్ళు, క్రీమ్లు కూడా లభ్యమౌతున్నాయి.
మరి ఇన్ని ఉపయోగాలున్న గ్రీన్ టీ ను రోజూ తాగటం మొదలెట్టేయండి. నేను రెండు సంవత్సరాల నుంచీ రోజూ మధ్యాహ్నాలు తాగుతున్నాను. మార్కెట్లో దొరికే గ్రీన్ టీబ్యాగ్స్ కన్నా , గ్రీన్ టీ ఆకులను కొనుక్కుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో త్రాగచ్చు.
గ్రీన్ టీ తయారీ:
* ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
* తరువాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 1,2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
* ఫ్లేవర్ కోసం ఆకులతో బాటుగా పావు చెంచా నిమ్మరసం, పంచదార బదులు తేనె కలుపుకుంటే ఆరోగ్యకరం.
* రెండు నిమిషాల తరువాత వడబోసుకుని త్రాగేయటమే..!
ఫ్లేవర్స్:
* నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది.
* నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.
* నిమ్మరసం వాడకపోయినా పుదీనాకు బదులు నాలుగు తులసి ఆకులు కూడా వాడవచ్చు.

Wednesday, February 26, 2014

ఆయుర్వేద వైద్య అద్భుతాలు!


ఆయుర్వేద వైద్య అద్భుతాలు!
చాలాసార్లు మనం కొన్ని అనారోగ్య సమస్యలకు పురాతన పధ్ధతులలో మందులు వాడుతూంటాం. వాటిలో మూలికావైద్యం ఒకటి. మూలికలు ఎన్నో వ్యాధులు నివారిస్తాయి. వాస్తవానికి వాటిగురించి మనం పూర్తిగా తెలుసుకోవటం చాలా కష్టం. ఈ సహజ వైద్యచికిత్సలు చాలా వ్యాధుల నివారణకు తోడ్పడతాయి. మనదేశంలో వనమూలికలతో చేసే వైద్యాన్ని ఆయుర్వేదం అని అంటారు. అనేక శతాబ్దాలనుండి ఆయుర్వేదం అమలులోవుంది. ఆయుర్వేద వైద్యానికి సంబంధించి కొన్ని మొక్కలను ఎలా వాడతారో పరిశీలించండి.
షుగర్ వ్యాధికి పరిష్కారంగా ...
కరివేపాకు - కరివేపాకును సాధారణంగా మన ఇండ్లలో చేసే వంటకాలలో ధారాళంగా వాడతారు. అది షుగర్ వ్యాధి నివారణలో అద్భుత ఫలితాలనిస్తుంది. 8 నుండి 10 పచ్చి ఆకులు ప్రతిరోజూ తింటే, సుమారుగా మూడు నెలల కాలంలో షుగర్ వ్యాధి స్ధాయిలో మార్పు వచ్చి చికిత్స లభించినట్లే. వంశానుగతంగా వచ్చే డయాబెటీస్ కు ఇది మంచి చికిత్స. కరివేపాకు బరువు కూడా తగ్గిస్తుంది.
దాల్చిన చెక్క - దీనిని కూడా వంటకాలలో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క కూడా డయాబెటీస్ తగ్గిస్తుంది. పసుపు, లవంగాలు వంటివి కూడా షుగర్ వ్యాధి నివారణకు వాడతారు.

ఉసిరికాయ - షుగర్ వ్యాధి వారిలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గించాలంటే ఉసిరికాయ మంచి పరిష్కారం. పచి్చిదిగా తినవచ్చు లేదా దానిని కాకర రసంతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరికాయను కనీసం రెండు లేదా మూడు నెలలు వాడితే మంచి ఫలితాలుంటాయి.
దగ్గు జలుబులకు మూలికల వైద్యం
తులసి - ఇంటి పెరటిలో పెరిగే తులసి సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు వంటి వ్యాధులకు బాగా పనిచేస్తుంది. తులసి ఆకులు తిన్నా లేక తులసి ఆకులను నీటిలో మరగించి టీ గా తాగినా జలుబు త్వరగా తగ్గుతుంది.
అల్లం - అల్లం దగ్గు, జలుబులకు మరో మంచి మూలిక ఔషధం. పచ్చి అల్లం ముక్కలుగా ఉప్పు కలిపి తినవచ్చు. లేదా తేనెతో కలిపి తినవచ్చు. లేదా అల్లం రసం కలిపిన టీ తాగవచ్చు. దగ్గు జలుబులకు అల్లం రసం సత్వర ఫలితాలనిస్తుంది.
దాల్చిన చెక్క - దాల్చిన చెక్క కూడా దగ్గు, జలుబులకు ఔషధంగా వాడవచ్చు. గొంతు నొప్పిని కూడా మాయం చేస్తుంది. దాల్చిన చెక్క పొడి చేసి చాయ్ లేదా కాఫీలలో వేసి తాగితే సత్వర ఫలితాలుంటాయి. లేదా డికాషన్ గా కూడా తాగవచ్చు.
గాయాలు తగ్గేందుకు
క్లైంబిగ్ డేఫ్లవర్ - ఈ మొక్క యాంటీ బాక్టీరియాగాను, యాంటి ఫంగస్ గాను పనిచేస్తుంది. గాయాలు చర్మ వ్యాధులు త్వరగా తగ్గాలంటే దీని రసాన్ని వైద్యంలో వాడతారు.
మేరీ గోల్డ్ - బంతి ఆకులను గాయాల నివారణకు వాడతారు. పూల రేకులను రసంగా చేసి గాయాలకు రాస్తారు.
పసుపు - పసుపును పేస్ట్ గా చేసి గాయాలకు రాస్తే అవి త్వరగా తగ్గుతాయి.
మన దేశ ఆయుర్వేద వైద్య విధానంలో, మొక్కలకు, మూలికలకు ప్రధాన స్ధానం వుంది.

ధ్యానం -ఆరోగ్య ఉపయోగాలు :


(Meditation and medical uses)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మానసిక ప్రశాంతత కావాలంటే ఒక చక్కని మార్గం ధ్యానం. ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందడం. ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత మాత్రమే కాదు. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందనీ, జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ మీకు తెలుసా? ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో అల్ఫా రిథమ్‌ అనే తరంగం నియంత్రణలో ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. స్పర్శ, చూపు, చప్పుడు వంటి వాటికి జ్ఞానాలకు దోహదం చేసే మెదడులోని కణాల్లో ఈ అల్ఫా రిథమ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది చీకాకుపెట్టే అంశాల వైపు ధ్యాస మళ్లకుండా చేసి ఏకాగ్రతను పెంపొందిస్తుంది. అందువల్ల ధ్యానం చేయటం ద్వారా మెదడులోని ఈ తరంగాలు నియంత్రణలో ఉంటున్నట్టు.. తద్వారా నొప్పి భావన తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచూ ఏకాగ్రత లోపంతో బాధపడేవారికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు సూచిస్తున్నారు.
అశాంతితో ఉన్నప్పుడు ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నా ప్రార్థన, ఫలితం దాదాపుగా చెడుగా ఉంటుంది. ఎదుటి వారికి ఏ విధంగా నష్టం చెయ్యకుండా ఉండటం వలన, వీలైతే తగినంత సహాయం చెయ్యడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, జీవిత పరమార్థకత వస్తుంది. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నాం… దానిని గుర్తించి, ఎదుటి వారు ఎవరైనా, ఎటువంటి వారైనా ఇబ్బంది పెట్టకుండా ఉందాం.

ఆకులో భోజనం ఎందుకుచేయాలి?

అరటిఆకులో భోజనంభోజనానికి ఉగయోగించే పాత్రలు అనేకం. బంగారం, వెండి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణిలతో తయారుచేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అలాగే కొందరు అరటి, మోదుగ, మఱ్ఱి , బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేస్తారు.
పూర్వం రాజులు, జమిందార్లు బంగారు పళ్ళాలను ఉపయోగించేవారు. కొంతమంది వెండికంచాల్లో తినేవారు. మిగిలినవారు భోజనానికి ప్రతిరోజూ అరిటాకు లేక మోదుగ విస్తర్లను ఉపయోగించేవారు. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, పింగాణి పళ్ళాలు వాడుకలోకి వచ్చయి. ఎన్ని రకాల పళ్ళాలు వచ్చినా అన్నిట్లోకి అరిటాకులో భోజనం చేయడం మిక్కిలి శ్రేష్టం. పచ్చటి అరిటాకులో వేడివేడి పదార్థాలను వేసుకొని తినడంవల్ల కఫవాతాలు(cold) తగ్గిపోతాయి. బలం చేకూరుతుంది.ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరానికి కాంతి వస్తుంది. ఆకలి పుడుతుంది. మోదుగ, మఱ్ఱి, రావి ఆకులను ఎండబెట్టి విస్తర్లను తయారుచేస్తారు. కానీ అరిటాకును పచ్చిగా ఉన్నపుడే ఉపయోగిస్తారు. పచ్చి ఆకులో పెట్టు కొని ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తిన్నడం శ్రేయస్కరం. పూర్వం భోజనానికి విస్తర్లు, నీళ్ళు తాగడానికి ఆకు దోనెలను ఉపయోగిస్తారు. అలాగే మోదుగ ఆకులతో‌కుట్టిన విస్తరిలో‌అన్నంతింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటున్నారు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మర్రిచెట్టు విష్ణువు స్వరూపం. మర్రి ఆకులో అన్నంతింటే క్రిమిరోగ నివారణి, కళ్ళకు సంబంధించిన దోషాలు తొలిగిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది. ముఖ్యంగా అరటి, మోదుగ, మర్రి ఆకు విస్తర్లలో భోజనం చేస్తే ప్రేగులలోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదంలో చెప్పారు. కాలక్రమేణా ఈ అలవాట్లు మారిపోయాయి. చాలామందికి విస్తరిలో భోజనం చేయడం అపురూపమైంది. కాంక్రీట్ జంగిల్ గా పేరొందిన నగరాలలో కూడా పండుగలు, పర్వదినాలలో మార్కెట్లో అరటిఆకులు అమ్ముతున్నారు. వాటిని కొన్నుకొని ఆ రోజు వాటిలో భోజనం చేసేవారు ఉన్నారు. ఇప్పటికీ కొన్నిప్రాంతల్లోని హోటళ్ళలో ఆకులోనే భోజనం పెడుతున్నారు. దీన్నిబట్టి ఆకుల్లో భోజనం చేయడానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

సర్వరోగ నివారణి పాలకూర

మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకు కూరలను తప్పనిసరిగి తీసుకోవాలి. మిగిలిని కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. పోషకాహార నిధి అయిన పాలకూరకు క్రమంగా తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును రానవ్వకుండా తోడ్పడుతుంది. పాలకూరలో లభించే విటమిన్ సీ, ఏ లు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు క్యాన్సర్ ను నివారిచడంలో తోడ్పడుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెడ్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ది చేసే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మహిళల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజ్ టెబుల్ సూప్ లోనూ, చపాతీలు చేసుకునే పిండీలోనూ, పకోడీల పిండోలోనూ, పన్నీర్ తో కలిపి వాడే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా వేపుడు చేసుకుని తినవచ్చు.

Sunday, February 23, 2014

సర్వరోగ నివారిని ప్రాణాయామం

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం.
1.ప్రాణాయామ విశేషాలు
ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.
ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.
ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.
వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.

రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
బయటికి వెళ్లి పోతుంది.
గుండెకు సత్తువ లభిస్తుంది.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
జఠరాగ్ని పెరుగుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

3. తీసుకోవలసిన జాగ్రత్తలు
మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

అరచేతిలో ఔషధం-ఆరోగ్యానికి ఆరు సూత్రాలు

కరతలామలకం అనే నాడుడి వంటింటి వైద్యానికి అతికినట్టు సరిపోతుంది. ాయుర్వేద ఔషద గుణాలున్న చిన్న చిన్న చిట్కాలతో వైద్యం చేసుకోవడంతో ఎంతో ఉపయోగకరం. అందుబాటులో ఉన్న చిన్న చిన్న మొక్కలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని ఇంటి పేరట్లో పెంచుకుంటే ఇక అర చేతిలో ఔషదం ఉన్నట్లే. పలురకాల సుగంధ ఔషధ మొక్కలు మన ఆరోగ్యాన్ని కాఫాడంలో ప్రధాన భూమికను పోషిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
1) వస
ఈ మొక్కల వేళ్లలో ఆసరోన్ డిహైడ్, ఆసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి. గొంతు వ్యాధులు, కడుపు నొప్పి, జ్వరం, మానసిక రుగ్మత, కాలేయం, రొమ్ము నొప్పుల నివారణ, మూత్రపిండ వ్యాధులు, ల్యూకో డెర్మా నివారణలో ఇవి ఉపయోగపడతాయి. ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారి ఎండిపోయిన తరువాత దుంపలను జాగ్రత్తగా తవ్వి తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కత్తిరించుకుని ఎండలో ఆరబెట్టాలి. వాటి ద్వారా వస మందు తయారు చేసుకోవచ్చు.
2) నేల వాము
ఈ మొక్కల్లో ఆండ్రోగ్రాఫాలాయిడ్స్ అనే చేదు రసాయనం ఉంటుంది. జ్వరం, మలేరియా, క్రిమిుల నివారణ, చర్మవ్యాధులు, మధుమేహవ్యాధి, గుండె జబ్బుల నివారణకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ మొక్క 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. అరవై రోజుల తరువాత ఇది ఔషధ మొక్కగా ఉపయోగపడుతుంది. దీనిని సేకరించిన తరువాత నీడలో ఆరబెట్టాలి. తరువాత దానిని మందుగా ఉపయోగించుకోవాలి. దీనికి ఎలాంటి తెగుళ్లుగానీ, చీడలు గానీ ఆశించవు. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.
3) అశ్వగంధ
ఈ మొక్కల వేర్లు నరాల బలానికి, వ్యాధి నిరోధకశక్తిని పెంచడానికి, అల్సర్ నివారణకు ఉపయోగపడతాయి. వీటి వేర్లలో విధానిన్, సొమ్మి ఫెరిన్ అల్కాయిడ్లు ఉంటాయి. అశ్వగంధ వేర్లను బాగా ఎండబెట్టిన తరువాత గ్రేడింగ్ పద్దతిలో విభజించుకోవాలి. వాటిని చూర్ణంగా తయారు చేసుకుని పంచదార కలపాలి. దీనికి నెయ్యి కలిపి తీసుకుంటే నిద్రలేమి నుంచి నివారణ పొందవచ్చు. దీనిని వంటింటి వైద్యంగా ఉపయోగించుకోవచ్చు. అశ్వగంధాది, అశ్వగంధారిష్ట లేహ్యం, బాల అశ్వగంధాది లక్సడి అనే ఔషధ గుణాలుంటాయి.
4) కలబంద
కలబంద జెల్ను చర్మ సౌందర్య క్రీముల్లో వాడతారు. కలబంద పత్రాల్లో రసాయనిక అలాయిడ్, గ్లైకోసైడ్ మిశ్రమంగా ఉండి బార్బలాయిన్, ఐసోబార్బలాయిన్, బి-బార్బలాయిన్ వంటి ఐసోమర్లు ఉంటాయి. కలబంద ఆకులను నేత్ర వ్యాధుల నివారణ, అల్సర్, చర్యవ్యాధులు, కాలేయ సంబంధిత, మానసిక రుగ్మతలకు వాడతారు. విరోచనాలు, రుతుక్రమాన్ని క్రమబద్దం చేయడానికి వాడతారు. వడదెబ్బ, అధిక వేడి, కాలిన గాయాలకు కలబంద జెల్ ఉపయోగపడుతుంది.
5) ఉసిరి
ఉసిరిలో గాలిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం, ఫిలెంలంబ్లిన్, టానిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం తదితర విటమిన్లు ఉంటాయి. ఉసిరి ని త్రిఫల చూర్ణం, విటమిస్ సి, పచ్చళ్లు, జెల్లీ, జామ్, చ్యవనప్రాశ లేహ్యం ఔషద తయారీలో ఉపయోగిస్తారు. మెదడును చల్లబరచడంలోను, చర్మవ్యాధులకు, మధుమేహ నివారణకు ఉపయోగిస్తారు. ఎండు ఉసిరికాయల నుంచి తీసిన నూనెను మందుల పరిశ్రమల్లో, తల నూనె, షాంపుల తయారీలో ఉపయోగిస్తారు. 10 గ్రాముల బరువున్న ఉసిరి కాయలో 600-900 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
6) శతావరి (పిల్లితీగ)
వీటి వేళ్లలో గ్లైకోసైడ్స్, బైసోజెనిన్, క్వెర్సిటిన్, సైటో స్టెరాల్, స్టెగ్నో స్టెరాల్ లాంటి ఆల్కలాయిడ్లు ఉంటాయి. నరాల పటుత్వం, దగ్గు, జ్వరం, అతిసారం, క్షయ, స్త్రీలకు పాల పెంపు తదితర వాటిలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మూత్ర సంబంధిత వ్యాధుల నివారణలో కూడా వాడతారు. శతావరి ఘ్రితం అనే ముఖ్యమైన ఔషధం ఇందులో ఉంటుంది.

పోపు పెట్టెలో దాగివున్న పది ఆరోగ్య సూత్రాలు!

'1. చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క :
దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
2. అల్లం పైత్యానికి విరుగుడు :
అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.
3. వెల్లుల్లి గుండెకు నేస్తం
పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి.
4. కుంకుంపువ్వు అందం ఆరోగ్యం
ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.
5. లవంగాలు శ్వాసకు మేలు :
లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.
6. జీర్ణశక్తికి జీలకర్ర
జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.
7. ఆవాలు
ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.
8. నల్లమిరియాలు
ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
9. పచ్చి ఏలకులు
ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.
10. ఫెన్నల్
ఇది మరువంలాంటి మొక్క. దీన్ని కూరల్లో వాడుతారు. ఫెన్నెల్స్ డైయూరిటిక్ గుణం కలిగి ఉంది. ఇది ఋతుస్రావ సమయంలోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొత్తికడుపులకు ఉపశమనాన్నిచ్చే శక్తి ఫెన్నల్ తైలానికి ఉంది. పాలిచ్చే తల్లులలో పాలు సమృద్ధిగా వుండడానికి ఎంతో తోడ్పడుతుంది.

స్టీవియాతో(మధుపత్రి ) మధుమేహం దూరం


మధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి
మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినేందుకు వెనుకాడుతుంటారు. కాని తీపి పదార్థాలను తిన్న తర్వాత మధుపత్రిని నమిలితే శరీరంలో చక్కెర శాతం అదుపులో వుంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్‌లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కల్గివుంటాయి. వీటినుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార స్టీవియా ఆకుల నుంచి తీసిన పంచదార ఒక స్పూనుతో సమానం. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. మన దేశంలోనే కాదు ఇప్పుడు విదేశాల్లోనూ స్టీవియా మొక్కలను పెంచుతున్నారు...అచ్చ తెలు గులో దీనిని మధుపత్రం అని అంటారు.
చెరకు కన్నా తీపి...
మధుపత్రి ఆకుల్లో చెరకు కన్నా మూడింతల తీపు వుంటుంది. భోజనం చేసే ఇరవై నిమిషాల ముందు మధుపత్రి (స్టీవియా) ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లోను పెంచుకోవచ్చు. మధుపత్రి ఇన్సులిన్‌ను విడుదల చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మధుప త్రి సేవిస్తుంటే మధుమేహ వ్యాధితోపాటు రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌, దంతాలు, గ్యాస్‌, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
స్వీట్‌ స్టీవియా ఇది అత్యంత తియ్యదనం కలిగిన ఔషదీయ మొక్క. కేవలం దీని పచ్చి ఆకులను తమలపాకుల్లా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే చాలు నోటి క్యాన్సర్‌ వంటి వ్యాధులు క్రమేణా దూరమవుతాయి. అంతేకాదు నోటి దుర్వాసన పోగొట్టే మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా దీనిని ఉపయోగించ వచ్చు. మామూలుగా పంచదార తింటే అనేక వ్యాధులు వస్తాయి. కానీ స్టీవియాతో తయారైన పంచదార తీసుకుంటే ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు కలిగించకపోగా... మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిర్భయంగా దీనిని తీసుకోవచ్చు.
ఆరోగ్య సంజీవని...
స్టీవియాను తీసుకుంటే మన శరీరంలో ఎటువంటి అదనపు క్యాలరీలు చేరవు. దీంతో రక్తంలోని గ్లూకోజ్‌లో ఏరకమైన మార్పు ఉండక... పెరిగిన నిల్వలను తగ్గించి గ్లూకోజ్‌ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో స్టీవియా అమోఘంగా పనిచేస్తుంది. ఇది కేవలం డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులకే కాక... అధిక రక్తపోటును తగ్గించడంలో, అంతకంతకూ పెరిగిపోతున్న ఊబకా యాన్ని స్థిరీకరించడంలో, దంత వ్యాధుల నివారణలో సంజీవినిలా పనిచేస్తుందని శాస్ర్తీయ పరిశోధనలలో తేలింది. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో... అత్యంత వేగవంతం గాను... సమర్థవంతంగాను పనిచేస్తాయని తేలింది.
ఎక్కడ పుట్టింది?
ఇన్ని సుగుణాలు ఉన్న ఈ మొక్క ఎక్కడ పుట్టిందో తెలుసా... ఇది పెరుగ్వే దేశంలో ఎక్కువగా కాలువల పక్కన, కొలనుల వద్ద విచ్చలవిడిగా పెరిగేది. దీనిని ఆ ప్రాంతం వారు కొన్ని శతాబా ్దలుగా ఔషధ విలువలు కలిగిన మొక్కగా గుర్తించి విరివిగా వాడుతుండేవారు. ఆ ప్రాంతంలో ఉండే ఆదివాిసీలుగా పిలువబడే గ్వారాని ఇండియన్లు దీనిని ‘క్వాహీహీ అని పిలిచేవారట. క్వాహీహీ అంటే తీపి మొక్క అని అర్థం.
దేశ,దేశాలలో...
సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ మొక్కలలోని విశేష గుణాలను జపనీయులు గుర్తించారు.గుర్తించడమే గాక దీనిని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అక్కడి నుండి చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా, తైవాన్‌ వంటి దేశాలు వీటి సాగు మీద శ్రద్ధవహించాయి. ఇటీవలే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థల గుర్తింపు వచ్చింది.

కలబంద

కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమా న్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూ స్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చ లు తగ్గు తాయి.
ఉదయం పరగడుపున కల బంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది.
కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమ వుతాయి.
రేగు చెట్టు ఆకులు కానీ, పండ్లుకానీ, బెరడుకానీ కలబందతో కలపి సబ్బులు, మాయిశ్చరైజర్‌ క్రీము ల ను తయారు చేస్తారు. ఈ క్రీము ముఖానికి రాసుకోవడం వల్ల ము డతలను మాయం కావడంతో పా టు సన్‌స్క్రీన్‌గానూ పనిచేస్తుంది. అలాగే ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.
కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా తయారవుతుంది.
శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలి న గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతా యంటున్నారు

ఆరోగ్యానికి బెండ. .

సన్నగా అమ్మాయి చేతి వేళ్ళలా నాజూకుగా కనిపించే బెండకాయలంటే ఇష్టపడనివారుండరేమో. . . విందుభోజనాల నుంచీ సాధారణ భోజనం వరకూ అన్నింటా కనిపించి ముద్దుగా ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ అనిపించుకుంది. దీనిలో పీచు, కాల్షియం, పొటాషియం. . . వంటి వాటితో పాటు పండ్లలో ఉన్నట్లే యాంటీ ఆక్సీడెంట్లు బెండలో అధికం. ఏంటీ ఇంత ఉపోధ్ఘాతం అనుకుంటున్నారా. . !బెండ ఆరోగ్యానికి ఎంతో అండ. ఇందుగలదు అందుగలదో అన్న సందేహం వలదు. . . ఎందెందు చూసినా అందందే కలదు అన్న చందంలో బెండ అన్ని దేశాలలో ప్రాచుర్యంలో ఉంది. అందుకే దీనిని భూగోళం అంతా పండిస్తున్నారు. దీనిలో ఉన్న పోషక విలువలు ఎలా అరోగ్యానికి ఉపయోగపడతాయో తెలుసుకుందామా. . .
బెండ తింటే తెలివి తేటలు పెరుగుతాయ్ నాన్నా. . తిను అని మన పెద్దవాళ్ళు కొసరి కొసరి బెండను తినిపిస్తారు. దానికి కారణం ఇందులో బీటాకెరోటిన్, బి-కాంప్లెక్స్, విటమిన్-సి, ఐరన్, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు బెండలో ఎక్కువ. అవి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేస్తాయి. దీని వల్ల నాడీవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు. దీన్ని తినటం వల్ల దిప్రెషన్ తగ్గుతుంది.
గర్భిణులకు ఇది మంచి ఆరోగ్యం. శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధి చెందుతుంది. ఇందులోని ఫోలిక్ ఆమ్లం చాలా ఉపయోగపడుతుంది.
అధికంగా ఉండే కాల్షియం , విటమిన్-సిల వల్ల బంధన కణజాలం, ఎముకలు, కీళ్ళు పనితీరు బాగుంటుంది.
కరగని పీచు ఎక్కువ. ఇది మలబధ్ధకానికి మన్చి మందు. చక్కెర వ్యాధి కూడా తగ్గుతుంది.
అధిక పీచు వల్ల దీని గ్లెయసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఈ పీచులోని పెక్టిన్ రక్తంలోని కొలెస్టాల్ సాతాని తగ్గిస్తుంది. అందుకే ఇది రక్తనాళాల్లో కొవ్వును కరిగిస్తుంది.
పొట్టలోని చక్కెర నిల్వల్ని పీల్చుకుంటుంది. ఇందువల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.
అల్సర్లతో బాధపడేవారు బెండ తరచూ వాడటం వల్ల అందులోని జిగురు జీర్ణకోశానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
ఇక అందం విషయానికొస్తే బెండ చాలా మంచిది. దీనిని తినటం వల్ల చర్మం మృదువుగా ఉండటంతో పాటు మొహం మీద మొటిమలు రాకుండా చేస్తుంది.
జ్వరం, డయేరియా, కడుపులోనొప్పికి బెండ రసం మంచిగా పనిచేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. ఇలా గృహ వైద్యానికి బెండ అన్ని విధాలా పనిచేస్తుంది. ఇక ఆలస్యమెందుకు బెండ ను తినేద్దామా. . . మరి. . !

సౌందర్యానికి ‘మందారం’

నేటి ప్రపంచంలో అదీ ఈ యాంత్రిక జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు.ఇక కేశ సమ్రక్షణ కోసం మరింత ఖర్చే పెడుతున్నారు.అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు,పోషణకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువే కాక ఖర్చు తక్కువ కూడా.
అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం.మందారం ఉపయోగలను తెలుసుకుందమా..
మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందానీ, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుందా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్లబడకుండా ఉందేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది.కేశాలకు వృధప్య చాయలు దరి చేరకుండ చూస్తుంది.చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమంటే మందారం అన్నిచోత్ల విరివిగా దొరకుతుంది.

శరీరంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచే కాకరకాయ

రుచికి చేదుగా వుండటం, వండేందుకు చాలా సమయం తీసుకోవడం వంటి కొన్ని కారణాలతో చాలామంది కాకరకాయను ఇష్టపడరు. కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. కాకరకాయలోని చేదు మధుమేహం వ్యాధికి విరుగుడని మనదేశంలో చాలామంది నమ్ముతుంటారు. హెర్బల్ వైద్యంలో కాకరకాయది కీలకమైన స్థానమే. కాకరకాయ పలు రోగాలకు మందుగా కూడా పనిచేస్తుంది. అలా అని తరచుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటే దీనికి వేడి కలిగించే గుణముంది. ఇందులో ఎక్కువ మోతాదులో 'Planu Insulin' ఉంటుంది. ఇది రక్తంలోని Sugar ని ప్రభావ వంతంగా తగ్గిస్తుంది. పరకడుపున 3/4 కాకరకాయ రసాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. కూర కూడా ప్రతిరోజు తీసుకోవచ్చు. కాకరకాయ గింజలను మెత్తగా నూరి నీటిలో కలిపి రోజు 1 Tea Spoonతీసుకోవాలి. కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది. కాకర వంటకాలు తిని ఆ లాభం పొందవచ్చు. కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది. రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాధి నయమవుంతుంది. షుగర్‌ వ్యాధి గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది. మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండుసార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు. కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే చాలు.

ఓట్ మీల్ నిజంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుందా

తెల్లని ఓట్స్ తో తయారుచేసే ఓట్ మీల్ చాలా సాధారణ ఆహారం. వోట్స్ వారి ఊక మరియు చాలా చిన్నగా తయారుచేయబడే తృణధాన్యాలు. అందువల్ల , ఓట్స్ ల అత్యధికంగా న్యూట్రీషియన్ ఉంటాయి . ఈ ఓట్స్ గుండె పనితీరును మెరుగుపరచడానికి మరియు శరీర విధులు మరియు జీవక్రియ పెంచడానికి , కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వోట్స్ కొంత అదనపు బరువు కూడా తగ్గిస్తుందని,అందుకే ఈ మద్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. చాలా మంది వోట్మీల్ వినియోగం వల్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుందని భావిస్తారు . ఓట్మీల్ తో తయారుచేసే అనేక ప్యాజ్ ఫుడ్ మరియు తక్షణం తయారుచేసుకగల ఓట్మీల్ ఉత్పత్తులు మార్కెట్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓట్ మీల్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల చాలా మంది వారి బరువు తగ్గించుకోవలిగారని అనేక రుజువు వివరణలు మరియు ఉదాహరణలు ఉన్నాయి . కానీ, బరువు తగ్గడానికి ఒక్క ఓట్మీల్ ఒక్కటే బాధ్యత వహించదు . ఓట్ మీల్ ను అనేక ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. ఓట్స్ లో విటమిన్స్ , ఫైబర్ , ఖనిజాలు మరియు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి . వోట్స్ బరువు తగ్గించడం మాత్రమే కాకుండా గుండె లోపాలు మరియు గుండె వ్యాధులు నిరోధించడానికి సహాయపడుతుంది.
వోట్స్ బరువు తగ్గించడంలో ఏవిధంగా సహాయపడుతాయిని వాటి గురించి రుజువులు మరియు వాస్తవాలను ఈ క్రింది విధంగా చర్చించబడ్డాయి. -
1. అధిక ఫైబర్ ఉన్నటువంటి ధాన్యం – వోట్స్ లోకరిగే మరియు కరగని ఫైబర్ రెండు గొప్పగా ఉన్నాయి. అధిక ఫైబర్ ఉన్న ఆహారం ఓట్స్ కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది . అలాగే, వోట్స్ డైట్ మీరు ఆహారంగా తీసుకోవడం వల్ల మీ కడుపు నిండుగా ఉన్న అనుభూతి చేయడానికి సహాయపడుతుంది మరియు మీకు ఆకలిని అవ్వనివ్వదు. బరువు తగ్గడానికి, మరియు మీ ఆకలిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆరోగ్యకరంగా తినాలి. హై ఫైబర్ డైట్ మీ మొత్తం ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
2. అధిక శక్తి కలిగినటువంటి ధాన్యం – వోట్స్ శరీరానికి అధిక శక్తి అందించడానికి మరియు శరీరం యొక్క పని పెంచడానికి సహాయపడుతాయి . అందువల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం, ఒక బౌల్ ఓట్స్ రోజంతా మీరు పనిచేయడానికి అవసరం అయ్యే మొత్తం శక్తిని అంధిస్తుంది . ఈ అధిక శక్తి శరీరం జీవక్రియల రేటును పెంచుతుంది అందువల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను కరిగిస్తుంది. ఓట్స్ డైట్ బరువు తగ్గించడానికి చాలా బాగ సహాయపడుతుంది. దాంతో శరీరానికి తగినంత శక్తిని అంధిస్తుంది.
3. యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ అధికంగా ఉంది: ఓట్స్ లో అత్యధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి ఇది టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు శరీరాన్ని ఉత్తేజపరస్తుంది . ఈ అధిక యాంటీఆక్సిడెంట్స్ అనవసరపు విషాన్ని శరీరం నుండి తొలగిస్తుంది . శరీరంలో చేరిన టాక్సిన్స్ ను తొలగిస్తుంది, దాంతో బరువు తగ్గిస్తుంది మరియు శరీర వ్యవస్థ శుభ్రపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని క్రియలు సక్రమంగా జరగడానికి మరియు జీవక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
4. లో క్యాలరీలు కలిగిన ధాన్యం – ఇతర ఆహారాలు పోలిస్తే వోట్స్ లో కెలోరీలు తక్కువ . అందువల్ల బరుతు తగ్గించుకోవడంలో ఈ ఓట్స్ ను చూపించడం జరిగింది. లోక్యాలరీ ఫుడ్స్ శరీరంలోని ఎక్స్ ట్రా ఫ్యాట్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది . ఓట్స్ చాలా తక్కువ సాంద్రత కలిగిన ఆహారం మరియు బరువుతగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో ఓట్స్ మాత్రమే సరిపోదు, ఓట్స్ త పాటు కొన్ని డైటరీ ఫుడ్స్ తో తీసుకోవాలి.
5. తయారుచేయడం సులభం: ఓట్స్ తృణధాన్యాలు ఆరోగ్యంగా ఉంటాయి . ఇతర తృణధాన్యాలన్నింటిలోకి వోట్స్ యొక్క ప్రధాన ప్రయోజనం వాటిని ఉడికించడానికి మరియు తినడానికి చాలా సులభంగా ఉంటుంది . వోట్స్ గంజి గా ఉపయోగించవచ్చు . వోట్స్ పండ్లు, పాలతో కలిపి తినవచ్చు. ఈ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ కోసం ఓట్స్ తో వివిధ రకాల ఆహారాలు తయారుచేస్తున్నారు. వాటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఓట్స్ వాటి ఇన్ స్టాట్ గా మరియు ప్యాక్ చేసినవైనా వాటిలో న్యూట్రీషియన్ వ్యాల్యూస్ ఏమాత్రం తగ్గవు. ఇవన్నీ కలిపి మొత్తం మీద బరువుతగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి నిరూపించబడ్డాయి.

యవ్వనాన్ని ప్రసాదించే అమృత ఫలం ఉసిరి


ఉసిరిక పండు వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది. మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును.
ఉసిరి పండు : ఆయుర్వేదము నందు ఉసిరిక పండునకు అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చిరి. ఉసిరిక పండు వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది. ఉసిరిక కాయలను ప్రతిరోజూ సేవించుట వలన శరీరములో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులను దరి చేరనివ్వదు.
అమృతముతో సమానమైన గుణములు కలిగి ఉండుట వలన దీనిని అమృత ఫలమందురు. నేత్రములకు మంచిది. మధుమేహము, కుష్టం, మూలశంక, స్త్రీలలో కలుగు ప్రదర రోగం (అధిక ఋతుస్రావం), రక్తస్రావ రోగం మొదలగు వ్యాదులలో అత్యుత్తమముగా పని చేయును. ఇందు అధిక మాత్రలో విటమిన్ సి ఉండును.
ఉసిరిక పండ్లతో చేసిన అత్యంత బలకరమైన, ప్రాచుర్యమైన మందు చ్యవనప్రాశావ లేహ్యం. మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును. ఈ రెండు కలిసిన మందు 'నిశాఅమలకి' టాబ్లెట్ గా మందుల షాపులలో లభ్యమగు చున్నది.
ప్రదర వ్యాధులందు (స్త్రీలలో వచ్చు అధిక ఋతుస్రావం) ఉసిరికాయల చూర్ణమును చక్కెర లేదా తేనెతో లేదా బియ్యం కడిగిన నీటితో ఇచ్చిన తగ్గును.
మూత్రం ఆగిపోయిన యెడల ఉసిరిక చూర్ణమును బెల్లంతో కలిపి ఇచ్చిన మూత్రం మరల సాఫీగా జారీ అగును. ఉసిరిక చూర్ణమును ప్రతిరోజూ సేవిన్చినచో నేత్ర వ్యాధులు తగ్గును.
ఈ విధముగా ఉసిరిక శ్వాస, క్షయ, దగ్గు, ఆమ్ల పిత్తము మొదలగు వ్యాధులయందు కూడా పని చేయును. శుక్ర వృద్ధిని చేయును. జ్ఞాపక శక్తిని పెంపొందిన్చును.

Saturday, February 22, 2014

బరువు తగ్గేటందుకు కొబ్బరినూనె వాడకం

కొబ్బరినూనె సాధారణంగా ప్రతి ఇంటిలోను వాడుతూంటారు. కొబ్బరి నుండి తీసే ఈ నూనెలో అనేక ఔషధ మరియు ఆహార ప్రయోజనాలున్నాయి. కొబ్బరినూనెతో అనేక వంటకాలు కూడా చేస్తారు. కొబ్బరి చెట్లు అధికంగా వుండే కేరళ వంటి రాష్ట్రంలో కొబ్బరినూనె వాడకం ఎంతో విరివిగా చేస్తారు. కొబ్బరినూనె దాని రుచికే కాక, బరువును తగ్గించేందుకు కూడా వాడతారు. బరువు తగ్గాలనుకునేవారికి సరైన వంట నూనె కొబ్బరినూనె. మరి కొబ్బరి నూనె బరువును ఎలా తగ్గిస్తుందనే అంశంపై కొన్ని వాస్తవాలు పరిశీలించండి.
బరువు తగ్గేటందుకు కొబ్బరినూనె వాడకం
1. కొబ్బరి నూనె తేలికగా జీర్ణం అవుతుంది. దానికి కారణం అందులో ఫ్యాటీ యాసిడ్లు తక్కువ కనుక తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడకుండా కూడా వుంటుంది.

2. కొబ్బరినూనెలోని ట్రిగ్లీ సెరైడ్స్ జీవక్రియను పెంచి, ఫ్యాటీ యాసిడ్లను శక్తిగా మారుస్తాయి.
3. కొబ్బరి నూనె వాడకం ద్వారా మీరు తినాలనే కోరికలను తగ్గించుకోగలరు. ఈ నూనెలో కార్బోహైడ్రేట్లు అధికం. కేలరీలు అధికంగా వుండి ఆకలిని నియంత్రిస్తాయి.

4. బరువు తగ్గాలంటే మీ ఆహారంలో కొబ్బరి నూనె తప్పక చేర్చండి. వంటనూనెలలో ఆహారాలు వేయించే బదులుగా కొబ్బరి నూనె లో వేయించి మార్పు గమనించండి.

5. మీ లోని జీవ క్రియ పెంచేటందుకుగాను వ్యాయామానికి ముందు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె ఒక గ్లాసు వేడి నీటిలో వేసి తాగితే బరువు కూడా తగ్గుతుంది.
6. కొబ్బరినూనె జీర్ణక్రియ మెల్లిగా జరిగేలా చేసి ఆకలి లేకుండా చేస్తుంది. అంతేకాదు రక్తంలోని బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తుంది.
7. బరువు పెరగటం, ఆకలి, అలసటలకు సంబంధించిన కేండిడా అనే ఒక ఈస్ట్ ను కొబ్బరినూనె అరికడుతుంది.
8. కొబ్బరినూనెనుండి ప్రయోజనాలు అధికంగా పొందాలంటే, దానిని రీఫైన్ చేయరాదు. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి.
కనుక బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో రుచికరమైన కొబ్బరినూనె చేర్చి బరువు, ఆరోగ్యం రెండూ పొందవచ్చు.

గుండె

మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్, ఆహారం అవసరం. అలాగే అక్కడి కార్బన్‌డయాక్సైడ్, మరికొన్ని మలిన పదార్థాల్ని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ పని రక్తం ద్వారా జరుగుతుంది. గుండె కొట్టుకొంటూండడంతో రక్తం శరీర భాగాలన్నింటికీ వెళ్ళడం, అక్కడ నుంచి వెనక్కి తిరిగి రావడం జరుగుతుంటుంది. ఇలా గుండె ఒక పద్ధతి ప్రకారం కొట్టుకుంటుండాలంటే దాని నిర్మాణంలో లోపాలుండకూడదు. కండరాలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. కవాటాలు సరిగా పనిచేస్తుండాలి. గుండె కండరాలకు రక్తసరఫరా సరిగ్గా జరుగుతుండాలి. గుండెలోని శక్తి ప్రవాహం కూడా పద్ధతిగా ఉండాలి. అప్పుడే గుండె ‘లబ్ డబ్’అంటూ సరి వేగంతో కొట్టుకుంటుంది. అలాగే గుండెనుంచి రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ తీసుకువెళ్ళే రక్త నాళాలలో సమస్యలొచ్చినా అనారోగ్యాలు కలుగుతాయి.

గుండె చుట్టూ వుండే రక్షక పొరని ‘పెరికార్డియమ్’ అంటారు. పెరికార్డియమ్‌లో కూడా ఇన్‌ఫెక్షన్ రావచ్చు. అలా ఇన్‌ఫెక్షన్ వస్తే గుండె చుట్టూ నీరు చేరుతుంది. ఈ అనారోగ్యంలో కూడా ఛాతీ ప్రాంతంలో నొప్పి వస్తుంది.
గుండె కండరాలు బలహీనమైతే గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. ఇలా వదిలేస్తే ‘హార్ట్ ఫెయిల్యూర్’కి దారితీస్తుంది. గుండెలోని ఒక ప్రక్కవున్న గదుల ద్వారా ఆక్సిజన్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలకి వెళ్తే, రెండో ప్రక్కనున్న గదులలోకి కార్బన్‌డయాక్సైడ్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలనుంచి చేరుతుంది. కాబట్టి రెండు ప్రక్కల రక్తాలు కలవకుండా ఉండాలి. అలాగే రక్తం ఒకవైపే ప్రవహిస్తుండాలి. ఇందుకు కవాటాలు తోడ్పడుతుంటాయి. వీటిలో లోపమున్నా గుండె గోడలో రంధ్రాలున్నా ఈ సమతుల్యం దెబ్బతిని గుండె నీరసించే ప్రమాదముంది. సాధారణంగా ఇలాంటి ఇబ్బందులు పుట్టుకతోను, చిన్నతనంలో రుమాటిక్ జ్వరం రావడంవల్ల కలగవచ్చు.

గుండెలో రంధ్రాలతోపాటు కవాటాలు మూసుకుపోయి పుట్టిన పిల్లల్లో చెడు, మంచి రక్తం కలవడంతో ‘సైనోటిక్ హార్ట్ డిసీజెస్’ రావచ్చు. వీళ్ళనే ‘బ్లూబేబీస్’ అంటారు. రక్తం నీలంగా మారడంవల్ల పిల్లలు నీలంగా కనిపిస్తారు. పుట్టుకతో వచ్చే ఈ లోపాలన్నింటినీ శస్త్ర చికిత్సలతో సరిదిద్దవచ్చు.
పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు 6-12 సం. మధ్య గొంతు ఇన్‌ఫెక్షన్స్ (ఫెరింజైటిస్) వచ్చి, వాటిని అశ్రద్ధచేస్తే- కీళ్ళ నొప్పులు, జ్వరంతో కూడిన ‘రుమాటిక్ ఫీవర్’ అనే వ్యాధి వస్తుంది. దీనికి వైద్యులకు చూపించి, సరైన చికిత్స చేయించాలి. లేకపోతే క్రమంగా కవాటాలు దెబ్బతిని, రుమాటిక్ హార్ట్ వ్యాధులకు దారితీస్తుంది.
మిగతా అన్ని అవయవాలకు లాగానే గుండెకి రక్తం సరఫరాచేయడానికి వేరే రక్తనాళాలుంటాయి. ఆ రక్తనాళాలను కరొనరి ధమనులంటారు. వాటిలో అడ్డంకులేర్పడడంవల్ల గుండె కండరాలకు రక్తసరఫరా తగ్గి ఎంజైనా మరియు హార్ట్ ఎటాక్‌లు రావచ్చు. వీటిని ‘కరొనరి హార్ట్ డిసీజెస్’ అంటారు.
మన లివర్ కొలెస్ట్రాల్‌ని తయారుచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. రక్తంలో ఒక భాగం ఇది. రక్తంలో ఇది ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడలలోపల గోడలమీద పేరుకుపోతుంటుంది. ఇలా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటే రక్తనాళాల లోపల దారి మూసుకుపోతుంటుంది. రక్తప్రసరణ దెబ్బతింటుంది.
రక్తం లీటరులో 5.5 మి. ఎమ్‌ఒఎల్‌కన్నా ఎక్కువుంటే ‘కరొనరి ఆర్టెరి డిసీజెస్’ వచ్చే అవకాశముంది.
రక్తంలో ప్రవహించే కొలెస్ట్రాల్‌లో కొవ్వులు, ప్రొటీన్లు రకరకాల పద్ధతుల్లో కలిసి ఉంటాయి. వీటినే లైపోప్రొటీన్లంటే తక్కువ సాంద్రతగల లైపోప్రొటీన్స్‌లో లెటిలైపో... ప్రోటీన్స్ (ఎల్‌డిఎల్). ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తంలో ఎక్కువ. ఎక్కువ సాంద్రతవున్న కొలెస్ట్రాల్... హైడెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) కూడా రక్తంలో ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్. ఎథిరో స్క్లేరోసిస్ రాకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువుండాలి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువుడాలి.
ఉదయం 5 గం. ప్రాంతంలో నడక వల్ల వ్యాయామమే కాదు ఈ సమయంలో శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాయి. ఈ సమయంలో నడకవల్ల ఎల్‌డిఎల్ తగ్గి, హెచ్‌డిఎల్ పెరుగుతుంది.
నడకతోబాటు మన నడతని మార్చుకోవాలి. ధూమపానం, ఆల్కహాల్‌లాంటి అలవాట్లు మానుకోవాలి. ఆహారపుటలవాటు మార్చుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇవన్నీ చేయక తప్పదు మన గుండెకోసం.
కరొనరి ధమనులు గుండెకి ఎడమవైపు రెండు, కుడివైపు ఒకటి ఉంటాయి. క్రొవ్వు పదార్థాలు, అడ్డంకులు తొలగించడానికి ఈ అడ్డంకులు 50% కన్నా తక్కువ వుంటే మందులతో కరిగించవచ్చు. 75%కన్నా ఎక్కువ ఒకటి లేక రెండింట ఉంటే యాంజియో ప్లాస్టి ద్వారా తొలగించవచ్చు.
అసలు అడ్డంకుల్ని తెలుసుకోవడానికి ‘యాంజియోగ్రామ్’ తోడ్పడుతుంది. ఇప్పడు ‘ఐవస్’ గైడెన్స్ కేథలాబ్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అమర్చిన స్టెంట్‌లు సరిగ్గా అమరాయా? లేదా తెలుసుకోవచ్చు. కష్టాన్ని కలిగించే అడ్డంకులకి బెలూన్స్ చికిత్సవల్ల లాభముందా? లేదా? తెలుసుకోవచ్చు. కాంప్లెక్స్ యాంజియో ప్లాస్టీలంటే ఎడమవైపు ఉండే ముఖ్య రక్తనాళంలో బ్లాక్‌లు, రక్తనాళాలు శాఖలుగా విభజన జరిగే ప్రాంతాలలో అడ్డంకులు, బైపాస్ అయిపోయిన తర్వాత గ్రాఫ్ట్‌లలో అడ్డంకులు, గట్టి కార్డియం అడ్డంకుల్ని తొలగించడానికి నిర్వహించేవి. వీటికి ఐవస్ తోడ్పడుతుంది.
మూడు రక్తనాళాలలో అడ్డంకులుంటే శస్తచ్రికిత్సతో తొలగించాల్సి రావచ్చు. ఈ శస్త్ర చికిత్సలో ఇప్పుడు సన్నటి రంధ్రం ద్వారా చేస్తున్నారు. కవాట మార్పిడి శస్తచ్రికిత్సల్ని చిన్న రంధ్రం ద్వారా చేస్తున్నారు.
చికిత్సలోకన్నా కూడా మనం ప్రధానం తెలుసుకోవాల్సింది వ్యాధులు రాకుండా నివారించడం. ఒకవేళ వ్యాధులు మొదలైనా ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే అపాయం కలగకుండా నివారించవచ్చు.
గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంటుంది. ఆ లయ రిథమ్ తప్పి కొట్టుకోవడాన్ని ‘ఎరిధ్మియా’ అంటారు. పైనుండే చిన్న రెండు గదులు- ఆరికల్స్‌లో కొట్టుకునే లయ తప్పడాన్ని ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అంటారు. అది డిజార్గనైజ్డ్‌గా తీవ్రంగా వచ్చే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్‌వల్ల వస్తుంది. ఎరిధ్మియాలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సాధారణంగా వస్తుంటుంది. వయసుని బట్టి ఈ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ ఎక్కువవుతుంది. ఇది వచ్చిన లక్షణాలుండకపోవచ్చు. చెమటలు పట్టడం, ఫెయింట్ అవడం జరగవచ్చు. ఛాతీ నొప్పి రావచ్చు. గుండె ఫెయిలవ్వవచ్చు. గుండె కొట్టుకునే రేటు పెరిగినా, తగ్గినా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. పైగా ఆరికల్స్ కదలికలు సరిగ్గా ఉండకపోతే రక్తం పేరుకుపోవడానికి ‘స్టాసెస్’ కారణమవుతుంది. దీనివల్ల రక్తం గడ్డలు కట్టే రిస్క్ ఎక్కువ. ఈ బ్లడ్ క్లాట్స్, గుండెవైపు వెళ్ళి, అక్కడి రక్తనాళాలలో అడ్డంగా ఏర్పడవచ్చు.
కొన్ని మందులతో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గవచ్చు. గుండె కొట్టుకునే రేటు ఈ మందులతో తగ్గుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకునే రేటుని ఎలక్ట్రిక్ కార్డియో వెర్షన్‌తో మామూలు స్థితికి రావచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గడానికి శస్తచ్రికిత్స, కేధటార్‌తో చేసే చికిత్సా విధానాలు తోడ్పడతాయి. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌తో బాధపడేవారు రక్తం పలుచనవడానికి మందులు తీసుకోవడం మంచిది.
గుండె కొట్టుకునే రేట్ సరిగ్గా ఉండేందుకు, చర్మం క్రింద (్ఛతీ భాగంలో) పెట్టే పరికరాన్ని కృత్రిమ ఫేస్‌మేకర్ అంటారు. మామూలుగా గుండెలో ఉండే ఫేస్ మేకర్ పనిచేయకపోయినా, నోడ్ దగ్గర పుట్టిన విద్యుత్‌ని గుండె అంతా వెంట్రికిల్స్ వరకు విస్తరించేట్టు చేసే మార్గాల్లో అడ్డంకులేర్పడ్డా కృత్రిమ ఫేస్‌మేకర్ని పెట్టాల్సి ఉంటుంది.
ఈ విషయాలన్నింటిమీదా అవగాహన ఉంటే గుండె అనారోగ్యాలు కలుగకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ ఏవైనా అనారోగ్యాలు కలుగుతున్నా ప్రారంభంలో గుర్తించగలగాలి. గుర్తించి ఊరుకోకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యుడికి చూపించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించి, చికిత్స చేయించుకోవాలి.ఇవాళ ఎటువంటి హృద్రోగానికైనా చికిత్స ఉంది. గుండె పూర్తిగా దెబ్బతింటే గుండె మార్పిడి చేస్తున్నారు. ఎటొచ్చీ..మన గుండె చప్పుడు మనం గమనిస్తుండాలి..అంతే.
గుండె నేర్పే పాఠాలు
నీ జీవన విధానాన్ని సరిగా ఉంచుకో.. ఏ ఆహారం పడితే ఆ ఆహారాన్ని సమయం సందర్భం లేకుండా తీసుకోకు.. కాయకష్టమే పాతకాలం వాళ్ళ గుండెకి శ్రీరామరక్ష. శారీరక శ్రమ, తీసుకున్న కేలరీలను ఖర్చుపెట్టడానికి సైక్లింగ్, ఈతో, నడకో ఏదో ఒక వ్యాయామం రోజుకో 45 నిముషాలన్నా అవసరం. ధూమపానం ఆల్కహాల్ సేవనం లంటి అలవాట్లకి దూరంగా ఉండడం, వంశపారంపర్యంగా గుండె సమస్యలుంటే ఆ రిస్క్‌కి తగ్గ జాగ్రత్తలు, చిన్నవయసు నుంచే తీసుకోండి. మానసిక వత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానము, సంగీతం వినడం, పుస్తక పఠన లాంటి- అలవరచుకోండి. మీ జీవన విధానాన్ని మార్చుకోవాలని ఒక ప్రక్క చెబుతూ మరోప్రక్క-
నిర్విరామంగా కృషిచేయండి. నిస్వార్థంగా బ్రతకండంటూ కూడా చెబుతోంది. గుండె ఇరవై నాలుగ్గంటలూ కొట్టుకుండేలా కష్టపడమని మనకి చెబుతోంది. అలాగే శరీరమంతటికీ వెళ్ళాల్సిన రక్తం తన గుండెకి వెళ్తున్నా గుండె ఒక్క చుక్క తీసుకోదు... అని అవయవాలకు కొన్ని రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. అలాగే గుండెకీ కరొనరి రక్తాల ద్వారా సరఫరా జరుగుతుంది.
గుండె జబ్బులు రాకుండా...
గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యవంతులు తీసుకోవలసిన ఆహారం గురించి ముందు మాట్లాడుకుందాం. ఫైబర్... అంటే పీచు పదార్థాలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. ఓట్స్, చిక్కుడు జాతి కూరగాయల్లో, అవిసె గింజల్లో, యాపిల్, సోయా గింజల్లో, కారట్, ఆకుకూరల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌లోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ని తగ్గిస్తాయి. మాంసం, పాల పదార్థాలలో శాచురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి. మనం రోజువారీ తీసుకునే కేలరీస్‌లో ఇవి 10%కి మించరాదు. బిస్కట్లు, పేస్టీస్, చాక్‌లెట్, ఫ్రెంచి ఫ్రైస్‌లాంటి బేకరీ పదార్థాలలో ట్రాన్స్‌ఫాట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని తినకుండా ఉండడం మంచిది. నెయ్యి, వెన్న, డాల్డాలాంటి శాచురేటెడ్ ఫాట్స్‌ని బాగా తగ్గించి తీసుకోవాలి. ఉప్పుని కూడా బాగా తగ్గించి తీసుకోవాలి. చల్లని నీళ్ళలో ఉండే పాలోన్, పాల్‌డైన్ లాంటి చేపలు మంచివి.
గుండెకి మూలకణ చికిత్సలు
‘కార్డియా’ అనే గ్రీకు పదానికి ‘గుండె’ అని అర్థం. అందుకని కార్డియక్ అంటే గుండెకి సంబంధించిన అని అర్థం. ఇన్‌వాలంటరీగా పనిచేసే కండరాలతో పనిచేస్తుంటుంది కాబట్టి గుండె ఆగకుండా అలా కొట్టుకుంటుంది. మన శరీరంలో ఇలాంటి కండరాలు మరెక్కడా లేవు. గర్భంలోని శిశువుకు 21 రోజు వయసు వచ్చేసరికి గుండె ఏర్పడడమే కాదు, కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. గర్భంలో ఆడ, మగ గుండె కొట్టుకునే రేట్లలో తేడా ఉంటుంది.
మొదటి నెలలలో గర్భంలో శిశువు గుండె నిముషానికి 75నుంచి 80 సార్లు వరకు కొట్టుకుంటుంది. ఏడవ వారంలో నిముషానికి 165 నుంచి 185సార్లు కొట్టుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి పది రోజులకు గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. 9.2 వారాలనుంచి గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 150కి తగ్గుతుంది. క్రమంగా 15 వారాలకు గుండె కొట్టుకునే రేటు 145కు తగ్గుతుంది.
శిశువు గర్భంలో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలతో లోపాలుంటే తెలుసుకోవచ్చు. కొన్నింటిని గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. కవాటాల లోపాలు లాంటి వాటిని శిశువు చుట్టూవున్న మూల కణాల్ని తీసి, కావలసిన సంఖ్యకి లేబరేటరీలో పెంచి ఈ కవాటాన్ని కవాట లోపమున్న శిశువు జన్మించగానే అమర్చవచ్చు.
గుండె కండరాలు దెబ్బతింటే అదే వ్యక్తి బోన్‌మార్మోనుంచి మూలకణాలు తీసి లేబరేటరీలో కావలసిన సంఖ్యలోకి పెంచి, గుండె కండరాలలోకి ఎక్కించి, కండరాల్ని బలమయ్యేట్టు చేయవచ్చు. ఈ చికిత్స ఫలితం కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. కొంతే అభివృద్ధి చెందితే మళ్ళీ ఆ ప్రాంతంలో మూల కణాల్ని పంపి మరికొంత అభివృద్ధి కనిపించేట్టు చేయవచ్చు. ఎవరి మూలకణాల్ని వారికి ఎక్కిస్తారు కాబట్టి, రోగ నిరోధక మందుల్ని జీవితాంతం వాడాల్సిన పనిలేదు. మూల కణ చికిత్సని పునరుత్పత్తి వైద్యమంటారు. ఇది భవిష్యత్తులో బంగారంలాంటి చికిత్సగా భావిస్తారు.
గుండె భారం పెంచకండి
యాంజియో ఇంతకుముందు తొడలోని రక్తనాళాల ద్వారా చేసేవారు. తొడలోంచి చేయడంవల్ల రక్తస్రావం అధికంగా ఉండేది. ఒకరోజు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చేతి మణికట్టునుంచి రేడియల్ రక్తనాళం ద్వారా యాంజియో చేస్తున్నాం. రక్తస్రావం తక్కువ చేతినుంచి కాబట్టి త్వరగా పంపించి వేయడం జరుగుతోంది. ప్రతిరోజూ గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని 90,000 కి.మీ దూరం నెడుతుంటుంది. ఒక ఎత్తునిబట్టి బరువుంటుంది. దీనిని బాడీమాస్ ఇండెక్స్ అంటారు.
బాడీమాస్ ఇండెక్స్= బరువు కిలోలలో/ ఎత్తు మీటర్లలో
బాడీ మాస్ ఇండెక్స్ 20నుంచి 25వరకు మామూలు బరువు. 25 నంచి 30 వరకు ఉంటే అధిక బరువు. 30నుంచి 35 వరకు స్థూలకాయం గ్రేడ్ 1, 35నుంచి 40 స్థూలకాయం గ్రేడ్ 2, 40కన్నా స్థూలకాయం గ్రేడ్ 3- మార్బడ్ ఒబేస్ అంటారు. ఉండాల్సిన దానికన్నా శరీర బరువు ఒక కిలో ఎక్కువ వుంటే గుండెకి రోజుకి 30 కి.మీ దూరం ఎక్కువ నెట్టాల్సిన భారం పడుతుంది. బరువు ఎక్కువైనకొద్దీ గుండె మీద పడే భారం ఎక్కువవుతుంది. అందుకని బరువుని అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్‌లో నరాలు దెబ్బతింటాయి. అందుకని గుండె నొప్పి వచ్చినా తెలీదు. కాబట్టే డయాబెటిస్‌ని సైలెంట్ కిల్లర్ అంటారు. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడం అవసరం.దవడ దగ్గర నుంచి బొడ్డువరకు ఎక్కడ నొప్పి వచ్చినా అనుమానం రావాలి. వెంటనే వైద్యుడికి చూపించాలి. కార్డియక్ అరెస్ట్ అయితే, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతే కార్డియో పల్మోనరి రిససిటేషన్ ప్రారంభించాలి. అంటే గుండె మీద ఒక చేత్తో మృదువుగా రాస్తూ, నోట్లో నోరుపెట్టి కృత్రిమ శ్వాసను కల్పిస్తూ, వెంటనే అవసరమైన చికిత్స అందేలా చూడాలి. ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే దాని సాయంతో డిఫిబ్రిలేషన్‌ని అందులో ఉంచవచ్చు.
గుండె జబ్బులున్నవాళ్ళ ఆహారం
తీసుకునే ఆహారంలో కొవ్వు 7%కి మించరాదు. రెడ్‌మీట్ పూర్తిగా మానేయాలి. మనం ఆహారంగా తీసుకునే జీవులలోని అవయవాలలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకూడదు. రొయ్యలు, పీతలు, గుడ్డులోని పచ్చ సొన, పాల పదార్థాలు లాంటి కొవ్వుని పెంచే పదార్థాల్ని పూర్తిగా మానేయాలి.
ఒమెగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా వున్న చేపలు, బాదం పప్పు, అక్రూట్, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటివి ఆహారంలో తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ని తగ్గించే ముడి ధాన్యాలు, దంపుడు బియ్యం, ఓట్స్, గోధుమలు, సోయా పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి, మొక్కజొన్న, చిక్కుడు, కేరట్ లాంటి కూరగాయలు; నారింజ, యాపిల్, బేరి, అరటి, అంజీర్, ఆప్రికాట్స్‌లాంటి పళ్ళు తీసుకోవడం మంచిది.

రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం

శరీరంలో రోగ నిరోధకశక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించుకోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చంటు న్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
విటమిన్లు :
విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకఒుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది.
జింక్‌ :
శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునః నిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్‌, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.
పెరుగు :
ప్రతి రోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.
కెరోటిన్‌‌‌ :
ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి.
వెల్లుల్లి :
దీనిలో ఉండే మినరల్స్‌ బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫె క్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
ఐరన్‌:
రోజూ నాలుగు లేదా ఐదశ్హు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది.
పొటాషియం :
దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతా దులో ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటుని తగ్గించి శక్తిని పెంచుతుంది.

కాళ్ల నొప్పులకు మందు..

శరీర బరువు, బస్సుల్లో గంటల తరబడి ప్రయాణం, అదే పనిగా నిలబడటం, ఆఫీసులో ఒకేచోట కదలకుండా ఉండటం వల్ల ఈ భారమంతా కాళ్లమీదే పడుతుంది. వీటితో చిన్న వయస్సులోనే కాళ్లనొప్పులు ప్రారంభమవుతాయి. ఎలాంటి నొప్పులు వచ్చినా కాళ్లు నడవాల్సిందే. లేదంటే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. దీంతో నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. దీంతో ఏదో ఒక పెయిన్‌ కిల్లర్స్‌ని వేసుకొని ఉపశమనాన్ని పొందుతుంటారు. ఇవి మొదట కాస్త ఉపశమనాన్ని ఇచ్చినా భవిష్యత్తులో ఆరోగ్యం మీద తీవ్రప్రభావాన్ని చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలికంగా మేలుచేసే మందులని కాకుండా ఈ పద్ధతిని పాటించి చూడండి.
గోరు వెచ్చటి నీటిని ధారగా ఎత్తి నొప్పి ఉన్నచోట పోయాలి.
కాళ్లను కొబ్బరి నూనెతో, వంట నూనెతో గాని మర్దనా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.
కాళ్ల కండరాలకు వారానికి రెండు సార్లు కోల్డ్‌ ప్యాక్‌ వేసుకుంటే రిలాక్స్‌ అవుతాయి.
వ్యాయామం, యోగ అలవాటు చేసుకోడం వల్ల శరీరంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి కాళ్లు తేలికబడతాయి.
వ్యాయామం చేస్తున్నప్పడు కాళ్లు నొప్పిగా అనిపిస్తే చెయ్యడం ఆపేయండి. అదే పనిగా చేస్తే కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది.
వాకింగ్‌ చెయ్యడం, నిద్రపోవడం, లేవడం ప్రతిరోజూ ఒకే సమయంలో చెయ్యాలి.
రోజుకి కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి.
పొగాకుకు, మద్యానికి దూరంగా ఉండాలి.
తాగే కాఫీ, టీలలో ఎక్కువ డికాషన్‌ ఉండకుండా చూసుకోవాలి.
ఎలా బడితే అలా లేవకూడదు. అలా లేస్తే కండరాల నొప్పులొస్తాయి.
అలసిపోయిన కాళ్లను మందులతో తగ్గించే ప్రయత్నం చెయ్యకుండా కాస్త విశ్రాంతి ఇస్తే త్వరగా ఉపశమనం ఇచ్చేవీలుంది. నొప్పి ఎక్కువగా వస్తుంటే వెంటనే డాక్టరుదగ్గరకు వెళ్లడం మంచిది.

సోయాబీన్స్ తో అందం


సోయాబీన్స్ తో అందం
మగువలు తమ అందాన్ని మరింత పెంచుకోవడం కోసం అనేక ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తుంటారు.అయితే ఈ పద్ధతులన్నీ కేవలం అందాన్ని తాత్కాలికంగా మాత్రమే కాపాడతాయే కాని శాశ్వతం కాదు ఈ విషయం తెలియని మహిళలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఆ తర్వాత సైడ్‌ ఎఫెక్ట్‌‌సతో బాదపడుతుంటారు. కాని మన ఇంటిలో లభించే పదార్ధాలతోనే మన అందాన్ని మరింతగా పెంచుకోవచ్చు అని గుర్తించాలి.
నానబెట్టిన సోయా గింజల్ని, దోసకాయ ముక్కలను కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని స్నానం చేసే ముందు శరారమంతా పట్టించి మృదువుగా రుద్దు కోవడం వల్ల శరీరం నునుపుదేలి, మేని వర్ణం మెరుగవుతుంది.రెండు చెంచాల సోయాపిండిలో అరచెంచా తేనె, కొద్దిగా టమాటా రసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయడం వల్ల ముఖ సౌంద ర్యం ఇనుమడిస్తుంది.
ఒక స్పూను సోయాపిండి, అరస్పూను నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేతుల కు రాసుకుని పావుగంట తర్వాత గోరువె చ్చని నీటితో శుభ్ర పరచడం వల్ల చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.పదిహేను సోయాగింజలు, నాలుగు బా దం పప్పులను నాలుగైదు గంటలసేపు నా నబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా త యారుచేయాలి.
ఈ విశ్రమంలో టీ స్పూ న్‌ తేనె, నాలుగైదు చుక్క నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పల్చగా పట్టిం చాలి. అర్ధ గంట తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి. వారానికోసారి ఈ విధంగా చేయడం వల్ల చర్మం కోమలత్వాన్ని, నిగారింపును సంతరించుకుంటుంది. సోయాపిండి, పెసరపిండి సమ భాగాలుగా తీసుకుని స్నానం చేసేటప్పుడు స బ్బుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ పిండిని ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన రీతిలో చర్మం పరిశుభ్రపడి నునుపుగా మారుతుంది. మొటిమల వల్ల ముఖం మీద నల్లమచ్చలు ఏర్పడిన వారికి ఓ సులువైన పరిష్కారమార్గం వుంది. సోయాపాలలో శగపిండి, కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. దీనితో నల్లమచ్చలు క్రమేపీ కనుమరుగవుతాయి.

క్లోమ గ్రంథినొ కాపాడుకోవడమెలా?

డయాబెటిస్ రాకుండా చూడటంలో క్లోమగ్రంథి పాత్ర చాలా కీలకం. ఈ గ్రంథి స్రవించే ఇన్సులిన్ హార్మోన్ వల్లనే డయాబెటిస్ దరిచేరదు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ గ్రంథి వాపుకు గురయితే? దాన్నే పాంక్రియాటైటిస్ అంటారు. మరి పాంక్రియాటైటిస్ వల్ల ఏం జరుగుతుంది? గుర్తించడమెలా? చికిత్స ఏంటి?
ప్రోటీన్ పదార్థాలు జీర్ణమవడంలో పాంక్రియాస్(క్లోమగ్రంథి)కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ అనే హోర్మోన్‌ను స్రవించడం ద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. ఈ గ్రంథి కొన్ని కారణాల వల్ల వాపుకు గురవుతుంది. దీన్ని 'పాంక్రియాటైటిస్' అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అక్యూట్ పాంక్రియాటైటిస్, క్రానిక్ పాంక్రియాటైటిస్.
అక్యూట్ పాంక్రియాటైటిస్
అత్యవసరంగా వచ్చే వాపును అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. ఈ తరహా వాపుకు గురయినపుడు బొడ్డు పైభాగంలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. నొప్పి వెన్నులో కూడా ఉంటుంది. నొప్పి తట్టుకోలేని స్థితిలో రోగి ఉంటారు.
ఏం జరుగుతుంది?
క్లోమ నాళంలో అడ్డంకులు ఏర్పడటం మూలంగా క్లోమ రసం బయటకు రాకుండా గ్రంథిలోనే నిలిచి పోతుంది. దీంతో ఆ గ్రంథే దాన్ని డైజెస్ట్ చేస్తూ పోతుంది. అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడటం మూలంగా పాంక్రియాస్‌కు రక్తం నిలిచిపోతుంది. దీనివల్ల రక్తసరఫరా నిలిచిపోయిన పాంక్రియాస్ భాగం చనిపోతుంది. దీన్ని 'పాంక్రియాటిక్ నెక్రోసిస్' అంటారు.
కారణాలు
పాంక్రియాటైటిస్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో వస్తుంది. గాల్‌స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి పాంక్రియాటిక్ డక్ట్‌ను బ్లాక్ చేసినపుడు వచ్చే అవకాశం ఉంది. దీన్ని 'గాల్‌స్టోన్ రిలేటెడ్ పాంక్రియాటైటిస్' అంటారు. లిపిడ్స్(ట్రైగ్లిసరైడ్స్) శాతం, కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్న వారిలోనూ రావచ్చు.
ఒక్కోసారి ఏ కారణం లేకుండానే పాంక్రియాటైటిస్ కనిపిస్తుంది. దీన్ని 'ఇడియోపతిక్ పాంక్రియాటైటిస్' అంటారు. మరికొందరిలో పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా పాంక్రియాటైటిస్ వస్తుంది. దీన్ని 'కంజీనియల్ పాంక్రియాటైటిస్' అంటారు. అంతేకాకుండా కొన్ని రకాల మందుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
నిర్ధారణ
సీరమ్ ఎమైలేజ్ అనే రక్తపరీక్ష ద్వారా పాంక్రియాస్ పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్తపరీక్షలో సమస్య ఉన్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ టెస్ట్, సి.టి స్కాన్ అబ్డామిన్, ఈఆర్‌సీపీ అనే పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.
చికిత్స
సి.టి స్కాన్ అబ్డామిన్ పరీక్ష ద్వారా పాంక్రియాటైటిస్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. సివియర్ పాంక్రియాటైటిస్ వచ్చిన వారికి ఐసియూలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడుగా యాంటీ బయోటిక్స్ వాడటం, అన్నం తినలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఫ్లూయిడ్స్ ద్వారానే కావలసిన శక్తిని అందించడం చేయాలి.
ఒకవేళ పాంక్రియాస్ నెక్రోసిస్ ఏర్పడినట్లయితే ఆ ప్రాంతంలో చీము తయారయి ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు 'పాంక్రియాటిస్ నెక్రోసెక్టెమీ' అనే శస్త్రచికిత్స ద్వారా చనిపోయిన పాంక్రియాస్ కణాలను(భాగాన్ని) తొలగించడం జరుగుతుంది. చనిపోయిన పాంక్రియాస్ భాగాన్ని తొలగించడం మూలంగా ఎంజైమ్ కొరత ఏర్పడుతుంది. దీన్నినివారించడానికి తగిన మందులు వాడాల్సి ఉంటుంది.
క్రానిక్ పాంక్రియాటైటిస్ లక్షణాలు
నొప్పి చాలా సంవత్సరాలుగా ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి వస్తూ ఉంటుంది. వెన్ను భాగంలో కూడా నొప్పి ఉంటుంది. దీన్ని చాలా మంది అల్సర్‌తో వస్తున్న నొప్పిలా భావించి ఏవో మందులు వాడుతూ ఉంటారు. దీనివల్ల సమస్య మరింత ముదిరిపోతుంది.
కారణాలు
రాళ్లు ఏర్పడటం మూలంగా ఇది వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ తీసుకునే వారిలోనూ, వంశపారపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. దీన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు. దీనికి ప్రధానంగా రెండు రకాల జీన్స్ కారణమవుతాయి. స్పింక్1, సీఎఫ్‌టీఆర్ అనే రెండు రకాల జన్యువుల్లో అబ్‌నార్మాలిటీస్ వల్ల క్రానిక్ పాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంది. పాంక్రియాటిక్ డక్ట్ అబ్‌నార్మాలిటీస్ ఉన్నప్పుడు, ఒక్కోసారి ఏ కారణం లేకుండానే రావచ్చు.

ఏం జరుగుతుంది?
క్లోమగ్రంథి మొత్తం ఫైబ్రోసిస్‌తో నిండిపోవడంతో గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల పాంక్రియాస్ ఎంజైమ్ కొరత ఏర్పడటం, డయాబెటిస్ మెల్లిటస్ డెవలప్ కావడం జరుగుతుంది.
చికిత్స
క్రానిక్ పాంక్రియాటైటిస్ నిర్ధారణ అయిన తరువాత మందులతో తక్కువయ్యే అవకాశం ఉందా. సర్జరీ చేయాల్సి వస్తుందా అనే విషయాన్ని పరిశీలించాలి. మందులతో తగ్గే అవకాశం లేనప్పుడు ఈఆర్‌సీపీ చేసి పాంక్రియాటిక్ డక్ట్‌లో స్టెంట్ వేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించేలా చేయవచ్చు. 'హెడ్ కోరింగ్' అనే సర్జరీ కూడా మంచి ఫలితాన్నిస్తుంది
. ఇందులో రాళ్లు తీసివేసి, క్లోమరసం వెళ్లడానికి వీలుగా న్యూ పాత్‌ను అమర్చడం జరుగుతుంది. మందులు పనిచేయని వారికి, ఆపరేషన్ సూటబుల్ కానివారికి పెయిన్‌కిల్లర్స్ ఇవ్వడం, పాంక్రియాస్ ఎంజైమ్స్‌ని సంప్లిమెంట్ల రూపంలో ఇవ్వడం, సీవీయాక్ నర్వ్‌ని బ్లాక్ చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయవచ్చు. ఇటువంటి వారికి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అందించడం చాలా అవసరం.
క్యాన్సర్ నిర్ధారణ
క్రానిక్ పాంక్రియాటైటిస్ ఉన్న వారు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. సివియన్ పెయిన్, సివియర్ వెయిట్‌లాస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ డెవలప్ అయిందని నిర్ధారణ అయితే సర్జరీ ద్వారా పాంక్రియాస్‌ను తొలగించాల్సి ఉంటుంది.
నివారణ
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆల్కహాల్ మానేయడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా పాంక్రియాటైటిస్ రాకుండా చూసుకోవచ్చు.

రక్తనాళాల్లో అడ్డంకలు ఎందుకు?

కొందరిలో నడిచేటప్పుడు పాదాల్లో, పిక్కల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పిని పంటి బిగువన భరించి నడవాల్సి వస్తుంటుంది. ఆర్థరైటిస్, సయాటికానో నొప్పికి కారణమని తేలికగా తీసుకుంటుంటారు. వయసు పైబడటం వల్ల నొప్పి వస్తుండవచ్చని మరికొందరు భావిస్తుంటారు. అయితే అన్ని నొప్పులకు ఆ కారణాలే అయి ఉండకపోవచ్చు.
కాళ్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం కూడా కారణం కావచ్చు. బ్లాక్స్ ఏర్పడటం వల్ల వచ్చే ఈ నొప్పిని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్(పీవీడీ) అంటారు. రక్తనాళాల్లో కొలెస్టరాల్, స్కార్ టిష్యూ మెల్లమెల్లగా డెవలప్ అయి గట్టిపడి రక్తసరఫరాకు ఆటంకం ఏర్పరుస్తుంది. 50ఏళ్లు పైబడిన ప్రతీ 20 మందిలో ఒకరు ఈ పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ బారిన పడుతున్నారు.
గుండె జబ్బులు, డయాబెటిస్, హై కొలెస్టరాల్, అధిక రక్తపోటుతో బాధపడే వారిలోనూ ఏర్పడుతుంది. పొగతాగే అలవాటు ఉన్నవారిలో సైతం ఈ క్లాట్స్‌కనిపిస్తాయి. యుక్తవయసులో స్మోకింగ్ చేయడం ప్రారంభించినట్లయితే త్వరగా ఈ పీవీడీ బారిన పడే అవకాశం ఉంది.
లక్షణాలు
నడుస్తున్నప్పుడు కండరాలు పట్టేయడం, తొడలు, పిరుదుల భాగంలో విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం నడకను ఆపేయాల్సి వస్తుంది. రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కాలి పాదాలు, వేళ్లలో నొప్పి ఉంటుంది. నీరసం, కాళ్లల్లో మంట, నొప్పి, తిమ్మిర్లు ఉంటాయి. కాళ్లు చల్లబడటం, కాళ్ల భాగంలో చర్మం రంగు మారడం, వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది.
నిర్ధారణ
బ్లాక్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కాళ్లలో రక్తప్రవాహాన్ని తెలుసుకోవడం ద్వారా పీవీడీని అంచనా వేయవచ్చు. చీలమండ భాగంలోనూ, మోచేతి భాగంలోనూ హ్యాండ్ డాప్లర్ ను అమర్చి రక్తసరఫరాను తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో రోగికి ఎటువంటి నొప్పి ఉండదు.
వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చు. సర్జరీ అనంతరం రోగి పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రక్తనాళాలకు సంబంధించి డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడం ద్వారా కూడా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. సి.టి స్కాన్, యాంజియోగ్రఫీ, ఎమ్ఆర్ఎ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్ పరీక్షల ద్వారా కూడా వ్యాధిని గుర్తించవచ్చు.
చికిత్స
రక్తనాళాల్లో క్లాట్ ఎక్కువగా ఉండి మందులతో కరిగే అవకాశం లేనప్పుడు యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా రక్తసరఫరాకు మార్గం సుగమం చేయవచ్చు. బెలూన్ సహాయంతో చేసే ఈ చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. కొందరిలో మందుల ద్వారానే క్లాట్స్ కరిగిపోయే అవకాశం ఉంది.
థ్రాంబోలైటిక్స్(క్లాట్‌బస్టర్స్)ను ఉపయోగించడం ద్వారా లేక చిన్న శస్త్రచికిత్సల ద్వారా క్లాట్స్‌ను తొలగించవచ్చు. ఒకవేళ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి ఉంటే పెరిఫెరల్ వాస్క్యులర్ బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్‌తో బాధపడే వారు శరీరంలో మిగతా భాగాల్లో ఎక్కడైనా క్లాట్స్ ఏర్పడుతున్నాయో చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గుండె, మెదడుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. పీవీడీతో బాధపడుతున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి పూర్తి పరీక్షలు చేయించుకుని గుండె రక్తనాళాల్లో క్లాట్స్ ఉంటే గనుక వాటిని అదే సమయంలో తొలగించుకోవడం మంచిది. కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే పాదాలను దిండుపై పెట్టి పడుకోవడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నివారణ
ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారినపడకుండా కాపాడుకోవచ్చు. తాజా కూరగాయలు, తక్కువ కొలెస్టరాల్ ఉండే ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నడక, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు, ట్రెడ్‌మిల్ ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా పీవీడీ రాకుండా చూసుకోవచ్చు.
స్మోకింగ్‌కూ దూరంగా ఉండటం, డయాబెటిస్ ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు పాదాలను పరీక్షించుకోవడం, గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవడం, వేడి నీళ్లను, బిగుతుగా ఉండే షూలను ఉపయోగించకుండా ఉండటం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

సర్వరోగ నివారిణి వెల్లుల్లి

మన ఆహారంలో ఉల్లిని తరచుగా ఉపయోగిస్తే, వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేదం చెబుతున్నది.
వెల్లుల్లిని వంటకాలలో బహు విధాలుగా వాడతారు. వెల్లుల్లిని నీరుల్లి, అల్లం, టమోటాలతో కలిపి వాడితే రుచిగా ఉండడమే కాక చాలా రోజులపాటు చెడిపోకుండా కూడా ఉంటుంది.
వెల్లుల్లిని పచ్చిగా కాని, ఆహార పదార్థాలతో గానీ వండుకుని, వేయించుకుని మందులాగా కానీ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయం. వెన్నలో వేయించుకుని రోజుకు ఏడు, ఎనిమిది వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారై క్రియాశీలతను పెంచుకుంటుంది. ఇందులో విటమిన్- సి, బి6, సెలీనియమ్, జింక్, కాల్షియమ్, పొటాషియమ్ వంటి లక్షణాలు ఉన్నాయి. విటమిన్-సితో అల్లిసిన్ కలిపి పని చేయడంవల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను నిరోధించడం చాలా తేలిక అవుతుంది. అంతేకాదు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవల్ల విటమిన్-సి, అల్లిసిన్‌ల పనితనం మరింతగా పెరుగుతుంది.
జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి, రొంప నుండి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలలో గంధక శికాల ఉంటాయి. ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం.
ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. ఆస్త్మాను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.

త్రిఫలచూర్ణంతో ఇన్‌ఫెక్షన్లకు చెక్

ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత పరిశోధనా ఫలితాల ప్రభావం వైద్యరంగంలో కూడా విప్లవాత్మక పరిణామాలకు దోహదపడటం వల్ల సగటు మానవుని ఆయుఃప్రమాణం గణనీయంగా పెరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ ఆరోగ్యప్రమాణాల స్థాయి మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం విచారించదగ్గ విషయం. ఆధునిక జీవన విధానాలు, వాతావరణ పర్యావరణ కాలుష్యం, నిద్రలేమి, అతినిద్ర, ధూమపానం, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, అనియమిత ఆహార సేవనం, అకాల భోజనం, శారీరక వ్యాయామం లేకపోవడం, వృత్తి,కుటుంబ, సామాజికపరమైన ఒత్తిళ్లు, వైద్య సలహా లేకుండా అవగాహన లేమితో కృత్రిమ ఔషధాలను విచ్చలవిడిగా, విచక్షణారహితంగా విరివిగా ఉపయోగించడం ఇత్యాది కారణాల వల్ల మన శరీరంలో ఉన్న వ్యాధినిరోధక శక్తి బలహీనపడుతోంది. తద్వారా వివిధరకాల బాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి క్రిములు దాడిచేసి అనేక కొత్త కొత్త సమస్యలను, రుగ్మతలను కలుగజేస్తున్నాయి. వీటితో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బుల్లాంటి వివిధ రకాల జీవనశైలి వ్యాధులు తిష్ట వేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడే దుష్పరిణామాలు లేని అందరికి అందుబాటులో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధ ఔషధ దినుసులను ఉపయోగించి సులువుగా తయారుచేసుకోగలిగే ఇంటిల్లిపాదికి సురక్షితంగా నిరపాయకరంగా ఉపయోగపడే ఔషధయోగం త్రిఫల చూర్ణం. పచారి కొట్లలో దొరికే కరక్కాయల బెరడు, ఉసిరికాయల బెరడులను పొడిచేసి సమానంగా కలిపితే తయారయ్యే దివ్యౌషధమే ఈ త్రిఫల చూర్ణం. ఈ విధంగా తయారైన ఔషధం ఆయుర్వేదౌషధ విక్రయశాలల్లో దొరుకుతుంది.
రోజూ రాత్రి పడుకునేటప్పుడు 5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని అరగ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి సేవిస్తుంటే మలబద్దక సమస్య తగ్గడమే కాక జీర్ణశక్తి మెరుగుపడి త్రేన్పుల, కడుపబ్బరం లాంటి అజీర్ణ లక్షణాలు తగ్గుతాయి. జననాంగాన్ని శుభ్రం చేసుకుంటే వైట్ డిశ్చార్జి తగ్గుతుంది. గోరువెచ్చగా చేసిన కషాయంలో అరగంట సేపు కూర్చుంటూ ఉంటే మూలవ్యాధి, ఫిషర్, భగందరం లాంటి ఇబ్బందులు తగ్గుతాయి.
దేహంలో అదనంగా పేరుకున్న కొవ్వు, తత్సంబంధ స్థూలకాయం తగ్గేందుకు రోజూ రెండుసార్లు రెండు మూడు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని తగినంత తేనె లేదా కప్పు పలుచటి మజ్జిగలో కలిపి తీసుకుంటున్నట్లయితే సత్ఫలితం కనిపిస్తుంది. త్రిఫల చూర్ణానికి 16 రెట్లు నీరు పోసి 8వ వంతు నీరు మిగిలేటట్లు మరిగించి, చల్లార్చి వడగట్టి మొండి పుండ్లు, గాయాలపై పట్టిస్తే అవి త్వరగా మానిపోతాయి. ఇదే కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిట పడుతుంటే తరచుగా వచ్చే నోటిపుళ్లు తగ్గుతాయి.
మధుమేహానికి...
ఆరోగ్యవంతులు సైతం తరచూ వ్యాధులకు గురికాకుండా కాపాడే ఈ త్రిఫల చూర్ణాన్ని నిత్యం సేవిస్తుంటే రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంటాయి. మధుమేహ వ్యాధి వల్ల నేత్రాలు, మూత్రపిండాలు, మెదడు, చర్మం తదితర అవయవాలు త్వరగా రుగ్మతలకు గురికాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
వ్యాధినిరోధక శక్తి పెరిగి మూత్రనాళ, జననేంద్రియ, ఫంగస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అంగస్తంభన, శీఘ్రస్ఖలన సమస్యలు పోతాయి. గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణాన్ని కలిపి పేస్టులా చేసి తల వెంట్రుకల కదుళ్లకు దట్టంగా పట్టించి గంట తరువాత శీకాయ లేదా కుంకుడు రసంతో తలస్నానం చేస్తే వెంట్రుకలకు బలం చేకూరుతుంది. జుత్తు రాలడం, చిట్లడం, తెల్లబడటం, చుండ్రు తగ్గుతాయి.
త్రిఫ్రల చూర్ణంలో తగినంత వంట సోడా కలిపి పిప్పిగోళ్లపై పట్టిస్తే క్రమంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. రోజూ దీంతో దంతధావనం చేస్తే దంత, చిగుళ్ల వ్యాధులు పోతాయి.

Friday, February 21, 2014

కీళ్లు పదిలం!


కీళ్లు పోతే కాళ్లు పోయినట్లేగా? పుట్టుకతో వచ్చినవి కదా! చిట్టచివరిదాకా ఉంటాయనుకుంటే పెద్ద పొరపాటే. కీళ్లయినా, కాళ్లయినా చివరిదాకా మనతోడుగా ఉండాలంటే కీళ్ల గురించిన అవగాహనా, అవి దెబ్బ తింటే బాగుచేయించుకునే శ్రద్ధ చాలా అవసరం. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి ఏ వైద్య విధానమైనా కావచ్చు. నిపుణుల పర్యవేక్షణలో మందులు వాడుతూ అవసరమైన వ్యాయామాలు చేయడం కూడా చాలా అవసరం.
అరవై ఏళ్లొచ్చినా అడుగులు తడబడేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడేమో 40 ఏళ్లకే కొందరు మోకాళ్లకో బెల్టు వేసుకుని నడిచే పరిస్థితి వచ్చేసింది. ఏమిటీ కారణం అంటే రకర కాల కీళ్ల వ్యాధుల జాబితా ఒకటి మన ముందు వచ్చి వాలిపోతుంది. కీళ్ల వ్యాధులు (ఆర్థరైటిస్) రెండు వందల రకాలు అంటే మనకు ఆశ్చర్యం వేయవచ్చు. కానీ, అది నిజం. వీటిలో పసి పిల్లల్లో వచ్చే వాటిని జెఆర్ ఆర్థరైటిస్ అంటారు. మిగతా సమస్యలను ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. ఇవి వయసుతో నిమిత్తం లేకుండా వస్తాయి. పెద్దవాళ్లలో వచ్చే కీళ్ల వ్యాధుల్లో ఆస్టియో ఆర్థరైటిస్, ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ రెండు భాగాలుగా విభజిస్తారు.
ఆస్టియో ఆర్థరైటిస్
ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య శరీరంలోని ఏ కీళ్లలోనైనా రావచ్చు. మోకాళ్ల నొప్పులు వాటిలో ఒకరకం మాత్రమే. కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి( కార్టిలేజ్) అరగడం వల్ల వచ్చే సమస్య ఇది. వయసు పైబడటంతో పాటు విపరీత శ్రమ, స్థూలకాయంతో పాటు ప్రమాదాల కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. వాస్తవానికి కార్టిలేజ్ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఎముకల్లో నిరంతరం సాగుతూనే ఉంటుంది. అయితే వయసు పైబడే కొద్దీ ఈ ఉత్పత్తి తగ్గిపోయి అరుగుదల ఎక్కువవుతుంది. అందుకే వృద్ధులే ఈ సమస్యకు ఎక్కువగా గురవుతూ ఉంటారు.
ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్
వ్యాధి నిరోధక శక్తిలో ఏర్పడే లోపాలే (ఇమ్యూన్ ఇంబాలెన్స్) ఇందుకు కారణం. సాధారణంగా కాలి బొటన వేళ్లల్లో మొదలయ్యే ఈ వ్యాధి కాళ్లూ చేతుల అన్ని వేళ్లకూ పాకుతుంది. భరించలేని నొప్పితో పాటు ఒక్కోసారి పూర్తిగా కదల్లేని స్థితి కూడా ఏర్పడవచ్చు. అల్లోపతి వైద్య విధానంలో పెయిన్ కిల్లర్లు, డిసీజ్ మోడి ఫయింగ్ డ్రగ్స్, స్టీరాయిడ్స్, బయలాజిక్ థెరపీల ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేస్తారు.

రుమాటిక్ ఫీవర్
చిన్న పిల్లల్లో కొందరికి ఈ సమస్య వస్తుంది. దీనికి స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణం. నొప్పి ఒక కీలునుంచి మరో కీలుకు అలా మారుతూ ఉంటుంది. సకాలంలో చికిత్సలు అందకపోతే వ్యాధి ముదిరి చివరికి గుండె కవాటాలు దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే వ్యాధి సోకగానే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. సమస్య తీవ్రమైనదే అయినా మూడు వారాలకు ఒకసారి చొప్పున పెన్సిలిన్ ఇవ్వడం ద్వారా అల్లోపతి వైద్యులు ఈ వ్యాధిని నయం చేస్తారు.

ఆయుర్వేదంలో
ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం కొన్ని గృహ చికిత్సలు, కొన్ని వైద్య చికిత్సలూ చెబుతుంది. ఆ శాస్త్రం చెప్పే గృహ చికి త్సల ప్రకారం: -
వెల్లుల్లి ముద్దను రెండు చెంచాల పరిమాణంలో తీసుకుని నువ్వుల నూనెతో కలిపి రోజుకు రెండు సార్లు వేడినీళ్లతో తీసుకోవాలి.
పది పారిజాతం ఆకులు, గుప్పెడు వావిలి ఆకులను కలిపి ముద్దగా దంచాలి. ఆ ముద్దను గ్లాసు నీళ్లలో కలిపి చిన్న మంట మీద సగం కషాయం మిగిలేంత వరకు మరిగించాలి. దీనికి ఒక చెంచా ఆముదాన్ని చేర్చి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.
అరకప్పు శొంఠి కషాయానికి, రెండు చెంచాల ఆముదం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
అరచెంచా శొంఠి, ఒక చెంచా నువ్వులు, అరచెంచా బెల్లం ఈ మూడింటినీ ముద్దగా నూరి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.
వీటిలో ఏదో ఒకటి చేస్తూ మహా నారాయణ తైలాన్ని కీళ్ల మీద పైపూతగా రాస్తే ఉపశమనం లభిస్తుంది.

వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
మహా యోగరాజ గుగ్గులు, స్వర్ణవాత రాక్షసం, వాత గంజాకుశ రసం, సింహనాద గుగ్గులు, మహారాస్నాదిక్వాదం వంటి మందులను వైద్యులు సూచిస్తారు. వీటిని కూడా వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అయితే పైపూతగా మహా విషగర్భతైలాన్ని వాడుకోవచ్చు.
హోమియోలో...
ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు హోమియో నిపుణుల సూచన ప్రకారం: బ్రయోనియా-6, లేదా రస్టాక్స్-6 మందులను సూచిస్తారు. రెండు రోజులకు ఒకసారి చొప్పున చాలా కాలమే వాడాలి.
మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉన్న వారు హైమోసాక్ ద్రవాన్ని ఉదయం 20 చుక్కలు, రాత్రి 20 చుక్కల చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి. కీ ళ్ల నొప్పులతో పాటు మధుమేహం ఉన్నవారికి ఏదో ఒకటిగా ల్యాక్టిక్ యాసిడ్-30, యురేనియం నైట్-30 మందులు బాగా పనిచేస్తాయి.
ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు మెర్క్‌సాల్-6, రస్టాక్స్-6 మందుల్లో ఏవో ఒకటి తీసుకోవచ్చు. వీటిని రోజుకు మూడు సార్ల చొప్పున రె ండు రోజులకు ఒకసారి తీసుకోవచ్చు.
వ్యాయామాలు
కీళ్ల నొప్పులకు మందులతో పాటు వ్యాయామాలు కూడా తప్పనిసరి. అయితే కాళ్ల మీద ఎక్కువ భారం పడని వ్యాయామాలు మరింత శ్రేయస్కరం. వాటిలో సైకిల్ తొక్కడం, ఈత ఉత్తమం. లేదా నేల మీద వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ పైకి ఎత్తి ఒకదాని తరువాత ఒకటిగా రెండు కాళ్లనూ సైకిల్ తొక్కినట్లు గుండ్రంగా తిప్పడం ఎంతో మేలు.

కంటి కింద నల్లటి వలయాలా? - ఎందుకు వస్తాయి?

కళ్లు... ఎన్నో ఊసులను చెబుతాయి.
కళ్లు... ఎన్నెన్నో భావాలను పలికిస్తాయి.
కళ్లు... నిశ్శబ్దంగానే అనేక అంశాలు వెల్లడిస్తాయి. మరి కళ్ల కింద ఏర్పడే వలయాలు...
ఆరోగ్యం గురించి హెచ్చరిస్తాయి. అనేక అనారోగ్యాలకు సూచనలు ఇస్తాయి. అసలు... ఈ నల్లని వలయాలు ఎందుకు వస్తాయి? తగ్గించుకోవడం ఎలా?
తెలియజేసేదే ఈ ముందుజాగ్రత్త...
‘‘కంటి కింద నల్లటి వలయాలా? అయితే... ఫలానా క్రీమ్ అప్లై చేయండి. కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోండి...!’’ అనే రకరకాల ప్రకటనలు చూస్తుం టాం. ఆ క్రీములను తెచ్చి కొన్నిరోజులు కళ్ల చుట్టూ రాసుకోవడం, అయినా వలయాలు తగ్గడం లేదే అని బాధపడటం.. సహజం. నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? ఈ వివరాలకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు... దాన్ని నివారించుకోడానికి అవసరమైన ‘ముందు జాగ్రత్త’లు ఇవి...
డెర్మటాలజీలో అతిసాధారణంగా పేర్కొనే సమస్య కళ్లకింద నల్లని వలయాలు. ఇంగ్లీషులో డార్క్ సర్కిల్స్ అనే ఈ వలయాలు వయసు పైబడట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటి వారికి తెలియజేస్తాయి. ఇవి స్ర్తీ, పురుషులిద్దరిలోనూ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లోనూ వృద్ధి చెందుతున్న డార్క్‌సర్కిల్స్ యుక్తవయసులోనూ ఎక్కువగా గమనిస్తున్నాం.

ప్రధాన కారణం...
రక్తనాళాల చివరను రక్తకేశనాళికలు అంటారు. అంటే వెంట్రక అంత సన్నగా ఉండే రక్తనాళాలన్నమాట. వీటినే క్యాపిల్లరీస్ అంటారు. కనురెప్పల్లో చివరన ఉండే రక్తకేశనాళికల చివరలు చిట్లడం, అందులోని ఎర్ర రక్తకణాలు విరిగిపోయినట్లుగా అయిపోతాయి. అలా విరిగినప్పుడు అక్కడ మిగిలిపోయే కొన్ని పదార్థాల వల్ల అది నలుపు, ముదురునీలం రంగులో కనిపిస్తుంటుంది. అక్కడి చర్మం సున్నితంగా, పారదర్శకంగా ఉండటం వల్ల కంటికింది భాగం నల్లగా, ముదురునీలంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా ఇవి కళ్ల కింద ఇలా వలయాల్లా కనిపిస్తుంటాయి. కంటి కింద నల్ల వలయాలు కనిపించడానికి అనేక కారణాలున్నాయి.
చికిత్స...
ఇటీవల కంటికింది నలుపును తగ్గించుకోడానికి చాలా చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సాధారణ మేకప్ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతనమైన సర్జరీ వరకు ఉన్నాయి.
హైపర్ పిగ్మెంటేషన్:
ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవడం వల్ల చర్మం నల్లగా మారి మచ్చలాగా కనిపించడం జరుగుతుంది. దీన్నే పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్ మరీ ఎక్కువగా ఉండి, కనురెప్పలకు కూడా పాకితే కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా కళ్లు, కంటి కింద బ్లాక్ సర్కిల్స్ ఏర్పడకుండా ఉండాలంటే సన్‌గ్లాసెస్ ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం మొదటగా చేయాల్సిన పని.
గుంటకళ్లు:
కొందరిలో కంటి కింద చర్మం లోతుగా ఉన్నట్లు అనిపిస్తూ కనుగుడ్డు లోపలికి ఉంటుంది. దాంతో కన్ను చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లుగా కనిపించడం మామూలే. కనుగుడ్డు కింద ఉండే కొవ్వు పదార్థం లోపించడం వల్ల చాలామందిలో ఇది అనువంశికంగా కనిపిస్తుంటుంది. కంటికింద కొవ్వునింపడం, (ఫ్యాట్ గ్రాఫ్టింగ్), బ్లఫరోప్లాస్టీ వంటి శస్తచ్రికిత్సల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. కొందరిలో శస్తచ్రికిత్స చేయకుండానే కంటి కింద డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్ల ద్వారా చాలా తక్కువ గాటుతో చేసే శస్తచ్రికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. డెర్మల్ ఫిల్లర్స్ అంటే చాలా మృదువైన కణజాలంతో అక్కడి ఖాళీని భర్తీ చేయడం అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా కూడా కంటికింది నల్లమచ్చల వలయాలకు చికిత్స చేయవచ్చు.
నివారణ 
డార్క్ సర్కిల్స్‌కు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖకాంతి కోసం లేజర్ థెరపీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలే ఈ సమస్య నివారణకు ఉపయోగపడతాయి.
తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
సమతులాహారం వేళ ప్రకారం తీసుకోవాలి.
వంశపారంపర్యంగా వచ్చే వలయాలను చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
శారీరక వ్యాయామాలు మనసునూ ఉత్తేజంగా ఉంచుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి రిలాక్సింగ్‌గా ఉంటారు. అందుకని రోజూ 30 నుంచి 60 నిమిషాలు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
చల్లని నీటిలో ముంచిన కాటన్‌ని అలసిన కళ్లపై ఉంచడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
కంటికి సంబంధించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి.
క్రీములతో...
హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కంటి కింద నల్లటి వలయాలు వస్తే... వాటిని కొన్ని పూత మందుల (క్రీమ్‌ల) ద్వారా తగ్గించవచ్చు. డాక్టర్‌ల సలహా మేరకు హోడ్రోక్వినైన్, కోజిక్ యాసిడ్, ఆర్‌బ్యుర్టిన్ వంటి పదార్థాలు ఉన్న క్రీమ్‌లు వాడటంతో నల్లటి వలయాలకు చికిత్స చేయడం సాధ్యమే. అర్జనైన్ వంటి హైడ్రాక్సీ యాసిడ్స్ ఉండే కెమికల్ పీలింగ్‌తోనూ (అంటే... పూత మందు రాశాక కాసేపాగి అది పొరలా ఏర్పడ్డ తర్వాత దాన్ని తొలగించడం) వాటిని తొలగించడం ఇప్పుడు సాధ్యమే. అయితే ఇది ఒకేసారిగాక కొన్ని సిట్టింగ్స్‌లో చేసే ప్రక్రియ.
కంటి కింది నలుపునకు కారణాలు:
ఎడతెరిపిలేని కంటి దురద
నిద్రలేమి (ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలోపాలు....)
అటోపిక్ డెర్మటైటిస్
అలెర్జీలు
హె ఫీవర్
దుమ్ము
ఎగ్జిమా
పాలిపోవడం:
ఏదైనా దీర్ఘకాల ఆరోగ్యసమస్య ఉంటే కళ్లచుట్టూ ఉన్న చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది.
ఐరన్ లేదా విటమిన్ లోపాలు
వైద్యపరంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు
వయసు:
మందంగా ఉండే చర్మం వయసు పై బడుతున్నా కొవ్వును కోల్పోతుంది. దీని వల్ల రక్తకణాలకు అవసరమైన ఆహారం అందక కళ్లకింద వలయాలు ఏర్పడతాయి.
డి-హైడ్రేషన్
వంశపారంపర్యం:
కుటుంబంలో తరతరాల నుంచి ఈ సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చేఅవకాశాలు ఉంటాయి.
జీవనశైలి:
పొగ తాగడం, మద్యం సేవించడం, కేఫినేటెడ్ సోడాలు తీసుకోవడం... వంటివి.
ముక్కు సమస్యలు:
కంటికి ముక్కుకు సంబంధించిన సూక్ష్మరక్తనాళాలు ఒత్తిడికి లోనయినప్పుడు డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి)
పిగ్మెంటేషన్
సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవడం.
క్యాచెక్సియా
అదేపనిగా చదవడం, టీవీ చూడ్డం..

స్వచ్ఛమైన అమృతం.. తేనె - ఉపయోగాలు


తేనె అమృతంతో సమానం. ఇది ప్రకృతి ప్రసాదిత దివ్యౌషధం. దీనిలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. మనదేహాన్ని, జీవక్రియలను క్రమపద్ధతిలో నడిపించగల శక్తి దీనికుంది. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి చోటివ్వాల్సిందే...
రెండువేల సంవత్సరాల క్రితం గ్రీక్ అథ్లెట్లు శిక్షణా కాలంలో వచ్చే శారీరక బాధలను తట్టుకోవడానికి తేనెను వాడేవారు. దాంతో వారికి శారీరక బాధలు తొలగిపోవడమే కాకుండా శరీరం ఎప్పటికప్పుడు శక్తిమంతం అయ్యేది.
తేనెలో గ్లూకోజ్‌తోపాటు ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. ఫ్రక్టోజ్ కాలేయంలో గ్లైకోజన్ ఉత్పత్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది.
తేనెలో కేలరీలు అధికంగా ఉంటాయి. తీసుకున్న వెంటనే కేలరీలు శరీరానికి అందుతాయి.
పడుకునే ముందు ఒక చెంచాడు తేనెను తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కేలరీలను కాలేయంలో నిల్వచేయగల శక్తి ఫ్రక్టోజ్‌కు ఉంది. దీనివల్ల మనం నిద్రపోతున్నప్పుడు మెదడు పనితీరుకు కావాల్సిన కేలరీలు సక్రమంగా అందుతాయి. దాంతో ఉదయం లేచిన వెంటనే అలసినట్లుగా అనిపించదు. అంతేకాదు ప్రశాంత మైన నిద్ర పట్టడానికి కూడా తేనె సహకరిస్తుంది.
తేనెను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల నోటిలో పొక్కులు, సిఫిలిస్ వ్యాధి తగ్గిపోతుందని వైద్యపితామహుడు హిపొక్రాట్ అప్పట్లోనే చెప్పాడు.
తేనె వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. దీంతో వ్యాధులపై పోరాడే శక్తి శరీరంలోని కణాలకు లభిస్తుంది.
సిడ్నీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షోన్‌బ్లెయిర్ 2007లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం గాయాలకు తేనెతో డ్రస్సింగ్ చేస్తే త్వరగా మానతాయని తేలింది.
జలుబు, దగ్గు, సోరియాసిస్, ఎగ్జిమా, కాళ్లమంటలకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఇది సుఖ విరేచనకారి. అరుగుదల లోపం, వయసు కారణంగా వచ్చే మలబద్ధకాన్ని తగ్గించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపే గుణం సైతం తేనెకుంది. దీనివల్ల శరీరం తేలిక పడుతుంది.
ప్రతి ఉదయం దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మోకాళ్లు, కండరాల నొప్పులు ఉపశమిస్తాయి.