Saturday, February 22, 2014

బరువు తగ్గేటందుకు కొబ్బరినూనె వాడకం

కొబ్బరినూనె సాధారణంగా ప్రతి ఇంటిలోను వాడుతూంటారు. కొబ్బరి నుండి తీసే ఈ నూనెలో అనేక ఔషధ మరియు ఆహార ప్రయోజనాలున్నాయి. కొబ్బరినూనెతో అనేక వంటకాలు కూడా చేస్తారు. కొబ్బరి చెట్లు అధికంగా వుండే కేరళ వంటి రాష్ట్రంలో కొబ్బరినూనె వాడకం ఎంతో విరివిగా చేస్తారు. కొబ్బరినూనె దాని రుచికే కాక, బరువును తగ్గించేందుకు కూడా వాడతారు. బరువు తగ్గాలనుకునేవారికి సరైన వంట నూనె కొబ్బరినూనె. మరి కొబ్బరి నూనె బరువును ఎలా తగ్గిస్తుందనే అంశంపై కొన్ని వాస్తవాలు పరిశీలించండి.
బరువు తగ్గేటందుకు కొబ్బరినూనె వాడకం
1. కొబ్బరి నూనె తేలికగా జీర్ణం అవుతుంది. దానికి కారణం అందులో ఫ్యాటీ యాసిడ్లు తక్కువ కనుక తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడకుండా కూడా వుంటుంది.

2. కొబ్బరినూనెలోని ట్రిగ్లీ సెరైడ్స్ జీవక్రియను పెంచి, ఫ్యాటీ యాసిడ్లను శక్తిగా మారుస్తాయి.
3. కొబ్బరి నూనె వాడకం ద్వారా మీరు తినాలనే కోరికలను తగ్గించుకోగలరు. ఈ నూనెలో కార్బోహైడ్రేట్లు అధికం. కేలరీలు అధికంగా వుండి ఆకలిని నియంత్రిస్తాయి.

4. బరువు తగ్గాలంటే మీ ఆహారంలో కొబ్బరి నూనె తప్పక చేర్చండి. వంటనూనెలలో ఆహారాలు వేయించే బదులుగా కొబ్బరి నూనె లో వేయించి మార్పు గమనించండి.

5. మీ లోని జీవ క్రియ పెంచేటందుకుగాను వ్యాయామానికి ముందు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె ఒక గ్లాసు వేడి నీటిలో వేసి తాగితే బరువు కూడా తగ్గుతుంది.
6. కొబ్బరినూనె జీర్ణక్రియ మెల్లిగా జరిగేలా చేసి ఆకలి లేకుండా చేస్తుంది. అంతేకాదు రక్తంలోని బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తుంది.
7. బరువు పెరగటం, ఆకలి, అలసటలకు సంబంధించిన కేండిడా అనే ఒక ఈస్ట్ ను కొబ్బరినూనె అరికడుతుంది.
8. కొబ్బరినూనెనుండి ప్రయోజనాలు అధికంగా పొందాలంటే, దానిని రీఫైన్ చేయరాదు. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి.
కనుక బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో రుచికరమైన కొబ్బరినూనె చేర్చి బరువు, ఆరోగ్యం రెండూ పొందవచ్చు.

No comments:

Post a Comment