Saturday, February 22, 2014
సోయాబీన్స్ తో అందం
సోయాబీన్స్ తో అందం
మగువలు తమ అందాన్ని మరింత పెంచుకోవడం కోసం అనేక ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తుంటారు.అయితే ఈ పద్ధతులన్నీ కేవలం అందాన్ని తాత్కాలికంగా మాత్రమే కాపాడతాయే కాని శాశ్వతం కాదు ఈ విషయం తెలియని మహిళలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్‌సతో బాదపడుతుంటారు. కాని మన ఇంటిలో లభించే పదార్ధాలతోనే మన అందాన్ని మరింతగా పెంచుకోవచ్చు అని గుర్తించాలి.
నానబెట్టిన సోయా గింజల్ని, దోసకాయ ముక్కలను కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని స్నానం చేసే ముందు శరారమంతా పట్టించి మృదువుగా రుద్దు కోవడం వల్ల శరీరం నునుపుదేలి, మేని వర్ణం మెరుగవుతుంది.రెండు చెంచాల సోయాపిండిలో అరచెంచా తేనె, కొద్దిగా టమాటా రసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయడం వల్ల ముఖ సౌంద ర్యం ఇనుమడిస్తుంది.
ఒక స్పూను సోయాపిండి, అరస్పూను నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేతుల కు రాసుకుని పావుగంట తర్వాత గోరువె చ్చని నీటితో శుభ్ర పరచడం వల్ల చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.పదిహేను సోయాగింజలు, నాలుగు బా దం పప్పులను నాలుగైదు గంటలసేపు నా నబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా త యారుచేయాలి.
ఈ విశ్రమంలో టీ స్పూ న్ తేనె, నాలుగైదు చుక్క నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పల్చగా పట్టిం చాలి. అర్ధ గంట తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి. వారానికోసారి ఈ విధంగా చేయడం వల్ల చర్మం కోమలత్వాన్ని, నిగారింపును సంతరించుకుంటుంది. సోయాపిండి, పెసరపిండి సమ భాగాలుగా తీసుకుని స్నానం చేసేటప్పుడు స బ్బుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ పిండిని ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన రీతిలో చర్మం పరిశుభ్రపడి నునుపుగా మారుతుంది. మొటిమల వల్ల ముఖం మీద నల్లమచ్చలు ఏర్పడిన వారికి ఓ సులువైన పరిష్కారమార్గం వుంది. సోయాపాలలో శగపిండి, కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. దీనితో నల్లమచ్చలు క్రమేపీ కనుమరుగవుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment