వ్యాయామంతోపాటు..
పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో
పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.
చూడచక్కని రూపం మన సొంతమవుతుంది. అవేంటో చూడండి మరి.
పసుపు:
వంటకాల్లో నిత్యం వేసే చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతాఇంతా కాదు.
యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలున్న పసుపుతో శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ కొవ్వు
కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల
తీవ్రతను తగ్గించే గుణం పసుపు సొంతం. కాలేయంలో చేరిన వ్యర్థ పదార్థాలను
వెలుపలికి నెట్టివేస్తుంది. నాళాల్లో రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు
తోడ్పడుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.
కరివేపాకు:
కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు.. అదనంగా పేరుకోకుండా చేసే శక్తి
కరివేపాకు రెమ్మల సొంతం. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపివేస్తుంది. చెడు
కొలెస్ట్రాల్‌నూ కరిగిస్తుంది. అందుకే వూబకాయంతో బాధపడేవారు రోజు
కరివేపాకును ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలంటూ సూచిస్తున్నారు
నిపుణులు.
ఆవనూనె:
ఇతర నూనెలతో పోల్చుకుంటే ఆవనూనెలో
శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువ. దాంతో శరీరంలో అధిక కొవ్వు చేరదు.
అంతేకాదు ఈ నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, ఓలిక్, లినోలిక్ ఆమ్లాలు,
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్లు
హృద్రోగాలను దూరం చేస్తాయి. అందుకే ఆవనూనెను తరచూ తీసుకోవాలి.
క్యాబేజీ:
ఉడికించిన క్యాబేజీలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. తరచూ క్యాబేజీ
తినడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ చేరవు. కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదమూ
తగ్గుతుంది. కండరాల దృఢత్వమూ సొంతమవుతుంది. రక్తాన్నీ శుద్ధిచేయడం..
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడం.. ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలుచేస్తుంది
క్యాబేజీ.
మొలకెత్తిన పెసలు:
వీటిలో 'ఎ','బి','సి','ఇ'
విటమిన్లు, ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం.. మాంసకృత్తులు,
పీచు.. వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు.. శరీర
బరువును అదుపులో ఉంచుతాయి మొలకెత్తిన పెసలు. అలాగే చాలా త్వరగా
జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ శాతమూ అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.
తేనె:
పంచదారతో పోలిస్తే.. తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా.. వేడినీటితో కలిపి
తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ
తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చినచెక్క.. కలిపి తీసుకోవడం వల్ల శరీర
బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు
బదులు తేనెను వాడితే మంచిది. ఏం చేయాలంటే.. గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో
చెంచా తేనె, కలిపి పరగడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
క్యారెట్:
క్యారెట్ శరీరంలోని చెడుకొవ్వు నిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర
పోషిస్తుంది. కొలెస్ట్రాల్ శాతమూ అదుపులో ఉంచుతుంది. పీచుపదార్థాన్ని
అందించే ఈ కాయగూరను వారంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు నేరుగా
తినే ప్రయత్నం చేయండి.
గుడ్లు:
శరీరానికి అవసరమైన పోషకాలే కాదు.. ఇందులోని విటమిన్ 'బి12' కొవ్వు కారకాలతో పోరాడుతుంది. ఫలితంగా కొవ్వుకరిగిస్తుంది.
గ్రీన్‌టీ:
అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు.. గ్రీన్‌టీ
తప్పనిసరిగా తాగాలి.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో
అధికకెలొరీలను తగ్గించడమే కాదు.. దృఢమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది
గ్రీన్‌టీ.
No comments:
Post a Comment