Wednesday, February 26, 2014

ఆకులో భోజనం ఎందుకుచేయాలి?

అరటిఆకులో భోజనంభోజనానికి ఉగయోగించే పాత్రలు అనేకం. బంగారం, వెండి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణిలతో తయారుచేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అలాగే కొందరు అరటి, మోదుగ, మఱ్ఱి , బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేస్తారు.
పూర్వం రాజులు, జమిందార్లు బంగారు పళ్ళాలను ఉపయోగించేవారు. కొంతమంది వెండికంచాల్లో తినేవారు. మిగిలినవారు భోజనానికి ప్రతిరోజూ అరిటాకు లేక మోదుగ విస్తర్లను ఉపయోగించేవారు. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, పింగాణి పళ్ళాలు వాడుకలోకి వచ్చయి. ఎన్ని రకాల పళ్ళాలు వచ్చినా అన్నిట్లోకి అరిటాకులో భోజనం చేయడం మిక్కిలి శ్రేష్టం. పచ్చటి అరిటాకులో వేడివేడి పదార్థాలను వేసుకొని తినడంవల్ల కఫవాతాలు(cold) తగ్గిపోతాయి. బలం చేకూరుతుంది.ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరానికి కాంతి వస్తుంది. ఆకలి పుడుతుంది. మోదుగ, మఱ్ఱి, రావి ఆకులను ఎండబెట్టి విస్తర్లను తయారుచేస్తారు. కానీ అరిటాకును పచ్చిగా ఉన్నపుడే ఉపయోగిస్తారు. పచ్చి ఆకులో పెట్టు కొని ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తిన్నడం శ్రేయస్కరం. పూర్వం భోజనానికి విస్తర్లు, నీళ్ళు తాగడానికి ఆకు దోనెలను ఉపయోగిస్తారు. అలాగే మోదుగ ఆకులతో‌కుట్టిన విస్తరిలో‌అన్నంతింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటున్నారు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మర్రిచెట్టు విష్ణువు స్వరూపం. మర్రి ఆకులో అన్నంతింటే క్రిమిరోగ నివారణి, కళ్ళకు సంబంధించిన దోషాలు తొలిగిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది. ముఖ్యంగా అరటి, మోదుగ, మర్రి ఆకు విస్తర్లలో భోజనం చేస్తే ప్రేగులలోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదంలో చెప్పారు. కాలక్రమేణా ఈ అలవాట్లు మారిపోయాయి. చాలామందికి విస్తరిలో భోజనం చేయడం అపురూపమైంది. కాంక్రీట్ జంగిల్ గా పేరొందిన నగరాలలో కూడా పండుగలు, పర్వదినాలలో మార్కెట్లో అరటిఆకులు అమ్ముతున్నారు. వాటిని కొన్నుకొని ఆ రోజు వాటిలో భోజనం చేసేవారు ఉన్నారు. ఇప్పటికీ కొన్నిప్రాంతల్లోని హోటళ్ళలో ఆకులోనే భోజనం పెడుతున్నారు. దీన్నిబట్టి ఆకుల్లో భోజనం చేయడానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment