Friday, February 21, 2014

బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం ....

కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు తింటూ... పళ్లరసాలు తాగితే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ విషయం మాకూ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటున్నారా... బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం తీసుకుంటే తిన్నది బాగా జీర్ణమై రక్తంలో త్వరగా కలిసిపోతుందట. దీనివల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు. బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం తినే పద్ధతి విదేశాల్లో ఇప్పటికే మొదలైపోయింది. ఒక్కో బ్లడ్ గ్రూప్ ఒక్కోరకమైన జీర్ణశక్తిని కలిగి ఉంటుంది. అందుకని బ్లడ్ గ్రూప్‌కి తగ్గ ఆహారం తీసుకుంటే జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఆ వివరాలు మీకోసం...
గ్రూప్-ఎ: ఈ బ్లడ్‌గ్రూప్ వాళ్లు కూరగాయలు, ఆకుకూరలతో పాటు చిరుధాన్యాలు, గింజధాన్యాలు, కార్బోహైడ్రేట్స్‌ను కూడా ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అయితే ఈ గ్రూప్ వాళ్లు మాంసాహారాన్ని తక్కువ మొత్తంలో తింటే మంచిది.
గ్రూప్ -బి: మాంసాహారం, చేప, కాయగూరలు, గింజధాన్యాలతో పూర్తిస్థాయి పౌష్టికమైన ఆహారాన్ని సుష్టుగా తీసుకోవచ్చు వీళ్లు.
గ్రూప్-ఎబి: చేప, కాయగూరలు, కార్బోహైడ్రేట్స్, గింజధాన్యాలు తినడం ఆరోగ్యకరం.
గ్రూప్-ఒ: చేపతో పాటు ప్రొటీన్ ఎక్కువగాఉండే మాంసం వంటి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఒ-గ్రూప్ వాళ్లకి
.

No comments:

Post a Comment