Friday, February 21, 2014

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆలస్య మెందుకు? గ్రీన్ టీని సేవించండి.

గ్రీన్‌టీలో సమృద్ధిగా లభించే పోషకాల్లో ... కాటెచిన్ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. శరీరంలోకి ప్రవేశించే క్యాన్సర్ కారకాలతో పోరాడి నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. శరీరానికి హానిచేసే కొలెస్ట్రాల్ టీ గ్లిసరైడ్స్ ఫైబ్రోనోజిన్ లాంటి వాటిని నివారిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందించే శక్తి గ్రీన్ టీకి ఉంది. బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆలస్య మెందుకు? గ్రీన్ టీని సేవించండి. కెలోరీలను ఖర్చు చేస్తుంది. పొట్ట ప్రాంతంలో నిల్వ ఉండిపోయిన కొవ్వును కరిగిస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. టీలోని కాటెచిన్స్ కెఫిన్ థియానైన్ లాంటి పదార్థాలే అందుకు కారణం.
శరీరానికి తేమ అందాలంటే మంచినీళ్ళు తాగితే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ గ్రీన్‌టీ కూడా నీటితో సమానంగా శరీరానికి తేమనందిస్తుంది. అంతేకాదు శరీరంలో ద్రవపదార్థాల్లో స్థాయిని నిలకడగా ఉంచుతుంది. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా నివారిస్తుంది.

దంత సమస్యలకు కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలించే ప్రత్యేక సుగుణాలు గ్రీన్ టీలో ఉన్నాయి. అందుకే జపనీయులు ఇప్పటికీ భోజనానంతరం గ్రీన్‌టీ తాగడానికి ప్రాధాన్యమిస్తుంటారు. పిల్లల్లోనూ ఈ అలవాటు పెంచేందుకు ప్రయత్నిస్తారు. యూనివర్శిటీ ఆఫ్ టోక్యోకు చెందిన అధ్యయన కర్తలు చెప్పినదాని ప్రకారం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది గ్రీన్ టీ. అందుకే దానిని బోన్ మినరల్ డెన్సిటీ పెంచే పానీయం అంటారు.
గ్రీన్‌టీలో సమృద్ధిగా లభించే పాలీ ఫెనాల్స్ ఫ్లవనాయడ్స్ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. తద్వారా కొన్నిరకాల అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడతాయి. ఒక్క ఆరోగ్యమే కాదు, టీద్వారా చర్మ సౌందర్యమూ మెరుగవుతుంది. టీలోకి పాలీ ఫెనాల్స్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మంలోని సాగేగుణం ఉన్న ఎలాస్టిక్ టిష్యూలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొన్ని దశాబ్దాల క్రితం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు గ్రీన్ టీని వాడేవారు. అధ్యయనాలు ఇదే వాస్తవాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా టైప్-1 మధుమేహం రాకుండా కాపాడుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తూ మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
అధ్యయనం ప్రకారం ఏడాదిపాటు క్రమం తప్పకుండా ఈ టీ తాగే వారిలో రక్తపోటు సుమారు 46 శాతం తగ్గుతుంది. రెండున్నర కప్పుల గ్రీన్ టీ తీసుకునే వారిలో 65శాతం దాకా తగ్గుతుందని తేలింది.

No comments:

Post a Comment