తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం
కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం,
మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని
అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి
ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు
న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం.
1.ప్రాణాయామ విశేషాలు
ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే
విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి
ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే
ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని,
బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం,
క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో
ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల
వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.
ప్రాణాయామం వల్ల
వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన
సర్వరోగ క్షయ భవేత్’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు
హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.
ప్రాణానికి ప్రాణ,
అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం.
అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం.
వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం,
పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం
తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే
క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్ పూరకం అని, తిరిగి బయటకి
వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి
సాధనాలు.మెడికల్ సైన్స్ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే.
కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.
వారి పరిశోధన
ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం
కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని
అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని
చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం
సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం
చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ
యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం
అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య
స్వరాలకు సంబంధించినదే.
2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
బయటికి వెళ్లి పోతుంది.
గుండెకు సత్తువ లభిస్తుంది.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
జఠరాగ్ని పెరుగుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.
3. తీసుకోవలసిన జాగ్రత్తలు
మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన
వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి,
సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు
శ్వాస సరిగ్గా ఆడుతుంది.
ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
No comments:
Post a Comment