డయాబెటిస్ రాకుండా చూడటంలో క్లోమగ్రంథి పాత్ర చాలా కీలకం. ఈ గ్రంథి
స్రవించే ఇన్సులిన్ హార్మోన్ వల్లనే డయాబెటిస్ దరిచేరదు. అంతటి ప్రాముఖ్యత
ఉన్న ఈ గ్రంథి వాపుకు గురయితే? దాన్నే పాంక్రియాటైటిస్ అంటారు. మరి పాంక్రియాటైటిస్ వల్ల ఏం జరుగుతుంది? గుర్తించడమెలా? చికిత్స ఏంటి?
ప్రోటీన్ పదార్థాలు జీర్ణమవడంలో పాంక్రియాస్(క్లోమగ్రంథి)కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ అనే హోర్మోన్‌ను స్రవించడం ద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. ఈ గ్రంథి కొన్ని కారణాల వల్ల వాపుకు గురవుతుంది. దీన్ని 'పాంక్రియాటైటిస్' అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అక్యూట్ పాంక్రియాటైటిస్, క్రానిక్ పాంక్రియాటైటిస్.
అక్యూట్ పాంక్రియాటైటిస్
అత్యవసరంగా వచ్చే వాపును అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. ఈ తరహా వాపుకు గురయినపుడు బొడ్డు పైభాగంలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. నొప్పి వెన్నులో కూడా ఉంటుంది. నొప్పి తట్టుకోలేని స్థితిలో రోగి ఉంటారు.
ఏం జరుగుతుంది?
క్లోమ నాళంలో అడ్డంకులు ఏర్పడటం మూలంగా క్లోమ రసం బయటకు రాకుండా గ్రంథిలోనే నిలిచి పోతుంది. దీంతో ఆ గ్రంథే దాన్ని డైజెస్ట్ చేస్తూ పోతుంది. అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడటం మూలంగా పాంక్రియాస్‌కు రక్తం నిలిచిపోతుంది. దీనివల్ల రక్తసరఫరా నిలిచిపోయిన పాంక్రియాస్ భాగం చనిపోతుంది. దీన్ని 'పాంక్రియాటిక్ నెక్రోసిస్' అంటారు.
కారణాలు
పాంక్రియాటైటిస్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో వస్తుంది. గాల్‌స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి పాంక్రియాటిక్ డక్ట్‌ను బ్లాక్ చేసినపుడు వచ్చే అవకాశం ఉంది. దీన్ని 'గాల్‌స్టోన్ రిలేటెడ్ పాంక్రియాటైటిస్' అంటారు. లిపిడ్స్(ట్రైగ్లిసరైడ్స్) శాతం, కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్న వారిలోనూ రావచ్చు.
ఒక్కోసారి ఏ కారణం లేకుండానే పాంక్రియాటైటిస్ కనిపిస్తుంది. దీన్ని 'ఇడియోపతిక్ పాంక్రియాటైటిస్' అంటారు. మరికొందరిలో పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా పాంక్రియాటైటిస్ వస్తుంది. దీన్ని 'కంజీనియల్ పాంక్రియాటైటిస్' అంటారు. అంతేకాకుండా కొన్ని రకాల మందుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
నిర్ధారణ
సీరమ్ ఎమైలేజ్ అనే రక్తపరీక్ష ద్వారా పాంక్రియాస్ పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్తపరీక్షలో సమస్య ఉన్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ టెస్ట్, సి.టి స్కాన్ అబ్డామిన్, ఈఆర్‌సీపీ అనే పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.
చికిత్స
సి.టి స్కాన్ అబ్డామిన్ పరీక్ష ద్వారా పాంక్రియాటైటిస్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. సివియర్ పాంక్రియాటైటిస్ వచ్చిన వారికి ఐసియూలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడుగా యాంటీ బయోటిక్స్ వాడటం, అన్నం తినలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఫ్లూయిడ్స్ ద్వారానే కావలసిన శక్తిని అందించడం చేయాలి.
ఒకవేళ పాంక్రియాస్ నెక్రోసిస్ ఏర్పడినట్లయితే ఆ ప్రాంతంలో చీము తయారయి ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు 'పాంక్రియాటిస్ నెక్రోసెక్టెమీ' అనే శస్త్రచికిత్స ద్వారా చనిపోయిన పాంక్రియాస్ కణాలను(భాగాన్ని) తొలగించడం జరుగుతుంది. చనిపోయిన పాంక్రియాస్ భాగాన్ని తొలగించడం మూలంగా ఎంజైమ్ కొరత ఏర్పడుతుంది. దీన్నినివారించడానికి తగిన మందులు వాడాల్సి ఉంటుంది.
క్రానిక్ పాంక్రియాటైటిస్ లక్షణాలు
నొప్పి చాలా సంవత్సరాలుగా ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి వస్తూ ఉంటుంది. వెన్ను భాగంలో కూడా నొప్పి ఉంటుంది. దీన్ని చాలా మంది అల్సర్‌తో వస్తున్న నొప్పిలా భావించి ఏవో మందులు వాడుతూ ఉంటారు. దీనివల్ల సమస్య మరింత ముదిరిపోతుంది.
కారణాలు
రాళ్లు ఏర్పడటం మూలంగా ఇది వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ తీసుకునే వారిలోనూ, వంశపారపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. దీన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు. దీనికి ప్రధానంగా రెండు రకాల జీన్స్ కారణమవుతాయి. స్పింక్1, సీఎఫ్‌టీఆర్ అనే రెండు రకాల జన్యువుల్లో అబ్‌నార్మాలిటీస్ వల్ల క్రానిక్ పాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంది. పాంక్రియాటిక్ డక్ట్ అబ్‌నార్మాలిటీస్ ఉన్నప్పుడు, ఒక్కోసారి ఏ కారణం లేకుండానే రావచ్చు.
ఏం జరుగుతుంది?
క్లోమగ్రంథి మొత్తం ఫైబ్రోసిస్‌తో నిండిపోవడంతో గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల పాంక్రియాస్ ఎంజైమ్ కొరత ఏర్పడటం, డయాబెటిస్ మెల్లిటస్ డెవలప్ కావడం జరుగుతుంది.
చికిత్స
క్రానిక్ పాంక్రియాటైటిస్ నిర్ధారణ అయిన తరువాత మందులతో తక్కువయ్యే అవకాశం ఉందా. సర్జరీ చేయాల్సి వస్తుందా అనే విషయాన్ని పరిశీలించాలి. మందులతో తగ్గే అవకాశం లేనప్పుడు ఈఆర్‌సీపీ చేసి పాంక్రియాటిక్ డక్ట్‌లో స్టెంట్ వేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించేలా చేయవచ్చు. 'హెడ్ కోరింగ్' అనే సర్జరీ కూడా మంచి ఫలితాన్నిస్తుంది
. ఇందులో రాళ్లు తీసివేసి, క్లోమరసం వెళ్లడానికి వీలుగా న్యూ పాత్‌ను అమర్చడం జరుగుతుంది. మందులు పనిచేయని వారికి, ఆపరేషన్ సూటబుల్ కానివారికి పెయిన్‌కిల్లర్స్ ఇవ్వడం, పాంక్రియాస్ ఎంజైమ్స్‌ని సంప్లిమెంట్ల రూపంలో ఇవ్వడం, సీవీయాక్ నర్వ్‌ని బ్లాక్ చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయవచ్చు. ఇటువంటి వారికి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అందించడం చాలా అవసరం.
క్యాన్సర్ నిర్ధారణ
క్రానిక్ పాంక్రియాటైటిస్ ఉన్న వారు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. సివియన్ పెయిన్, సివియర్ వెయిట్‌లాస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ డెవలప్ అయిందని నిర్ధారణ అయితే సర్జరీ ద్వారా పాంక్రియాస్‌ను తొలగించాల్సి ఉంటుంది.
నివారణ
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆల్కహాల్ మానేయడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా పాంక్రియాటైటిస్ రాకుండా చూసుకోవచ్చు.

No comments:
Post a Comment