వ్యాయామం చేయకపోవడం.. ఆహార నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల నడుం
చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. ఫలితంగా పొట్ట వస్తుంది. అది మరిన్ని సమస్యలకు
దారితీస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆహారం విషయంలో ఆచితూచి
వ్యవహరించాలి.
తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా
చూసుకోవాలి. రాగులు, జొన్నలు, ఓట్స్... తదితరాల్లో తక్కువ కెలొరీలుంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఫలితంగా మధుమేహం, కొవ్వును నియంత్రించిన వారమవుతాం.
పొట్ట వల్ల మధుమేహం సమస్య వచ్చే అవకాశం ఉందని... పైగా వారి సంఖ్య
రాన్రాను పెరుగుతోందని స్పానిష్ వైద్య నిపుణులు ఓ అధ్యయనంలో
వెల్లడించారు. ఇందుకు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లే ముఖ్య కారణం.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది.
భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు నియంత్రించాలంటే ఆలివ్ నూనెను తరచూ వంటకాల్లో
ఉపయోగించాలి.
నీళ్లు ఎక్కువగా తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే
పండ్లు, కూరగాయలు తరచూ తీసుకోవాలి. ముఖ్యంగా దోసకాయ, బొప్పాయి, పుచ్చకాయ,
నారింజ.. సొరకాయ, బీరకాయ.. వంటివి తరచూ తీసుకుంటే నడుము చుట్టూ పేరుకున్న
కొవ్వు తగ్గుతుంది.
ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు ఎక్కువగా
తీసుకోగలిగితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకోదు. ముఖ్యంగా ఎర్రటి క్యాబేజీ,
టమాటా, యాపిల్, ఎర్రక్యాబేజీ, చెర్రీ.. వంటివి ఎక్కువగా తీసుకోగలగాలని
సూచిస్తున్నారు ఇటలీ వైద్యులు.
తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.
No comments:
Post a Comment