Friday, February 21, 2014
మీ మెనూలో మష్రూమ్ (పుట్టగొడుగులు)ఉందా?
మీ భోజనంలో పుట్టగొడుగులు తీసుకొని ఎన్నిరోజులైంది. ఎన్ని రోజులకు ఓ సారి పుట్టగొడుగులు తింటారో ఓ సారి ఆలోచించండి. నెలలో ఓ సారయినా మీ మెనూలో పుట్టగొడుగులు లేకపోతే వెంటనే వాటిని మీ నెలసరి సరుకుల జాబితాలో చేర్చేయండి. ఎందుకంటే అత్యధిక పోషక విలువలు ఉన్న ఆహారం పుట్టగొడుగులు. ఇందులో హెపటో ప్రొటెక్టివ్, కార్డియో ప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్, యాంటీ అక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫెక్టివ్ గుణాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపణయింది.
పుట్టగొడుగుల్లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా, ఫైబర్ పాళ్లు ఎక్కువగా, ప్రొటీన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటును నియంత్రించే పొటాషియం, యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే సెలీనియం మష్రూమ్‌లో లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. అంతేకాకుండా ఫోలేట్, జింక్, విటమిన్-సి, విటమిన్-బి, రైబోఫ్లేవిన్, థయామిన్, నియాసిన్, బి6 విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. సెలీనియం ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. మష్రూమ్స్‌లో అత్యధికంగా గ్లూటామిక్ ఆసిడ్, అమైనో ఆసిడ్ లభిస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్లపై పోరాటానికి ఉపకరిస్తుంది. అర కప్పు (78గ్రా) ఉడికించిన మష్రూమ్‌లో 20గ్రా క్యాలరీలు, 1.7గ్రా ప్రొటీన్స్, 1.6గ్రా కార్బోహైడ్రేట్స్, 278 మిగ్రా పొటాషియం, 3.5 మిగ్రా నియాసిన్ లభిస్తాయి.
టాక్సిన్స్ ఉంటాయా?
పుట్టగొడుగులలో టాక్సిన్స్ ఉంటాయనే మాట వాస్తవం. అయితే ఉడికించినపుడు టాక్సిన్స్ పూర్తిగా తొలగిపోతాయని నిర్ధారణ అయింది. వైట్ మష్రూమ్స్‌లో కార్సినోజెన్ అగార్టిన్, హైడ్రాజీన్స్ అనే పదార్థాలు ఉంటాయి. పుట్టగొడుగులను ఉడికించినపుడు ఇవి నశించిపోతాయి. పుట్టగొడుగులలో కూడా చాలా రకాలున్నాయి. అడవుల్లో లభ్యమయ్యే కొన్ని రకాల పుట్టగొడుగుల్లో మాత్రమే విషం ఉంటుంది. ఫుడ్ స్టోర్స్‌లో కొనుగోలు చేసే ముందు ఒకసారి అవి ఏ రకానికి చెందినవో చూసి కొంటే సరిపోతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment