Sunday, February 23, 2014

అరచేతిలో ఔషధం-ఆరోగ్యానికి ఆరు సూత్రాలు

కరతలామలకం అనే నాడుడి వంటింటి వైద్యానికి అతికినట్టు సరిపోతుంది. ాయుర్వేద ఔషద గుణాలున్న చిన్న చిన్న చిట్కాలతో వైద్యం చేసుకోవడంతో ఎంతో ఉపయోగకరం. అందుబాటులో ఉన్న చిన్న చిన్న మొక్కలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని ఇంటి పేరట్లో పెంచుకుంటే ఇక అర చేతిలో ఔషదం ఉన్నట్లే. పలురకాల సుగంధ ఔషధ మొక్కలు మన ఆరోగ్యాన్ని కాఫాడంలో ప్రధాన భూమికను పోషిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
1) వస
ఈ మొక్కల వేళ్లలో ఆసరోన్ డిహైడ్, ఆసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి. గొంతు వ్యాధులు, కడుపు నొప్పి, జ్వరం, మానసిక రుగ్మత, కాలేయం, రొమ్ము నొప్పుల నివారణ, మూత్రపిండ వ్యాధులు, ల్యూకో డెర్మా నివారణలో ఇవి ఉపయోగపడతాయి. ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారి ఎండిపోయిన తరువాత దుంపలను జాగ్రత్తగా తవ్వి తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కత్తిరించుకుని ఎండలో ఆరబెట్టాలి. వాటి ద్వారా వస మందు తయారు చేసుకోవచ్చు.
2) నేల వాము
ఈ మొక్కల్లో ఆండ్రోగ్రాఫాలాయిడ్స్ అనే చేదు రసాయనం ఉంటుంది. జ్వరం, మలేరియా, క్రిమిుల నివారణ, చర్మవ్యాధులు, మధుమేహవ్యాధి, గుండె జబ్బుల నివారణకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ మొక్క 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. అరవై రోజుల తరువాత ఇది ఔషధ మొక్కగా ఉపయోగపడుతుంది. దీనిని సేకరించిన తరువాత నీడలో ఆరబెట్టాలి. తరువాత దానిని మందుగా ఉపయోగించుకోవాలి. దీనికి ఎలాంటి తెగుళ్లుగానీ, చీడలు గానీ ఆశించవు. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.
3) అశ్వగంధ
ఈ మొక్కల వేర్లు నరాల బలానికి, వ్యాధి నిరోధకశక్తిని పెంచడానికి, అల్సర్ నివారణకు ఉపయోగపడతాయి. వీటి వేర్లలో విధానిన్, సొమ్మి ఫెరిన్ అల్కాయిడ్లు ఉంటాయి. అశ్వగంధ వేర్లను బాగా ఎండబెట్టిన తరువాత గ్రేడింగ్ పద్దతిలో విభజించుకోవాలి. వాటిని చూర్ణంగా తయారు చేసుకుని పంచదార కలపాలి. దీనికి నెయ్యి కలిపి తీసుకుంటే నిద్రలేమి నుంచి నివారణ పొందవచ్చు. దీనిని వంటింటి వైద్యంగా ఉపయోగించుకోవచ్చు. అశ్వగంధాది, అశ్వగంధారిష్ట లేహ్యం, బాల అశ్వగంధాది లక్సడి అనే ఔషధ గుణాలుంటాయి.
4) కలబంద
కలబంద జెల్ను చర్మ సౌందర్య క్రీముల్లో వాడతారు. కలబంద పత్రాల్లో రసాయనిక అలాయిడ్, గ్లైకోసైడ్ మిశ్రమంగా ఉండి బార్బలాయిన్, ఐసోబార్బలాయిన్, బి-బార్బలాయిన్ వంటి ఐసోమర్లు ఉంటాయి. కలబంద ఆకులను నేత్ర వ్యాధుల నివారణ, అల్సర్, చర్యవ్యాధులు, కాలేయ సంబంధిత, మానసిక రుగ్మతలకు వాడతారు. విరోచనాలు, రుతుక్రమాన్ని క్రమబద్దం చేయడానికి వాడతారు. వడదెబ్బ, అధిక వేడి, కాలిన గాయాలకు కలబంద జెల్ ఉపయోగపడుతుంది.
5) ఉసిరి
ఉసిరిలో గాలిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం, ఫిలెంలంబ్లిన్, టానిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం తదితర విటమిన్లు ఉంటాయి. ఉసిరి ని త్రిఫల చూర్ణం, విటమిస్ సి, పచ్చళ్లు, జెల్లీ, జామ్, చ్యవనప్రాశ లేహ్యం ఔషద తయారీలో ఉపయోగిస్తారు. మెదడును చల్లబరచడంలోను, చర్మవ్యాధులకు, మధుమేహ నివారణకు ఉపయోగిస్తారు. ఎండు ఉసిరికాయల నుంచి తీసిన నూనెను మందుల పరిశ్రమల్లో, తల నూనె, షాంపుల తయారీలో ఉపయోగిస్తారు. 10 గ్రాముల బరువున్న ఉసిరి కాయలో 600-900 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
6) శతావరి (పిల్లితీగ)
వీటి వేళ్లలో గ్లైకోసైడ్స్, బైసోజెనిన్, క్వెర్సిటిన్, సైటో స్టెరాల్, స్టెగ్నో స్టెరాల్ లాంటి ఆల్కలాయిడ్లు ఉంటాయి. నరాల పటుత్వం, దగ్గు, జ్వరం, అతిసారం, క్షయ, స్త్రీలకు పాల పెంపు తదితర వాటిలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మూత్ర సంబంధిత వ్యాధుల నివారణలో కూడా వాడతారు. శతావరి ఘ్రితం అనే ముఖ్యమైన ఔషధం ఇందులో ఉంటుంది.

No comments:

Post a Comment